పంచ వాయువులు అంటే ఏమిటి, అవి ఏవి?
TeluguStop.com

మనకు వాయువు, వాయు దేవుడి గురించి చాలా బాగా తెలుసు.ఆయన లేకపోతే సృష్టి పెరిగేందుకు చాలా కష్టం అవుతుంది.


అయితే పంచ భూతాల గురించి మనకు తెలిసినప్పటికీ.పంచ వాయువుల గురించి మాత్రం మనకు అస్సలే తెలియదు.


అయితే అసలు పంచ వాయువులు అంటే ఏమిటి, అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచ వాయువుల్లో మొదటిది ప్రాణ వాయువు.ప్రాణ వాయువు శ్వాస, ఆహారం, నీటిని తీసుకొను బాధ్యత నిర్వహిస్తుంది.
ఇది గుండెలో కలదు.రెండోది ఆఫాన వాయువు.
ఆఫాన వాయువు శరీరంలో ఉండే మలినాలను విసర్జించేందుకు పని చేస్తుంది.ఈ రెండింటిని ప్రాణాపాన సమాయుక్తాన్ని సాధించ గలదు.
మూడోది వ్యాన వాయువు వ్యాన వాయువు మైక్రో మరియు మైక్రో సల్యూలార్ స్థాయిలో శరీరం నంతట గమనం కల్గిస్తుంది.
అలాగే నాలుగోది ఉదాన వాయువు.ఉదాన వాయువు శరీరం నందు ఇచ్చా పూర్వక కండరాల కదలికను నిర్వహిస్తుంది.
అలాగే ఐదోది సమాన వాయువు.సమాన వాయువు జీర్ణక్రియ బాధ్యతను నిర్వహించును.
సాధారణంగా ఉదరం నందు జీర్ణక్రియ బాధ్యత వహించును.వీటినే పంచ వాయువులు అంటారు.
అయితే మానవ శరీరంలో ఎప్పటి కప్పుడు జరిగే పనులను పంచ వాయువులు అంటారు.
పంచ భూతాలు లేకపోతే లోకం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో పంచ వాయువులు లేక పోతే కూడా మానవ శరీరం అంతే అన్నీ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
పంచ వాయువలు వల్లే మానవుడు బ్రతక గల్గుతున్నాడు.
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్…. తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న నేటిజన్స్!