మేఘనాథస్వామి-లలితాంబిక ఆలయం ఎక్కడుందో తెలుసా?

పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా జగన్మాత పార్వతీ దేవి లలితాంబికగా ఆవిర్భవించిన దివ్య క్షేత్రం తిరుమీయచూర్ ఆలయం.

ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో ఉంది.అయితే పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు.

జగన్మాత శ్రీచక్ర రాజ సింహాసనంపై ఆభయ హస్తంతో భక్తులను ఆశీర్వచనాలు అందిస్తోంది.తమిళ మాసమైన చితిరాయ్( ఏప్రిల్ -మే)లో సూర్య కిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి.

ఆలయ ప్రాశస్త్యం గురించి.నయనార్.

తిరుజ్ఞాన సంబందనార్ తన పద్యాల్లో రాశారు.ఆయుస్సు పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

80, 90వ జన్మదినాలను స్వామి సన్నిదిలో చేయడం ఎంతో పుణ్యమని భక్తలు విశ్వసిస్తారు.

అలాగే జగన్మాత లలితాంబికను సౌందర్యనాయకిగా కొలుస్తారు.ఇక్కడ వెలసిన దుర్గమ్మవారికి ఎనిమిది చేతులుండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు.

ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది.ఆలయ ప్రాంగణంలో మరిన్ని ఉపాలయాలను చూడవచ్చు.

ఉగ్ర రూపిణి నుంచి శాంత మూర్తిగా. పాండాసురుడనే రాక్షసుడు రుషులను, దేవతలను హింసించేవాడు.

అతని బాధలు పడలేక వారు జగన్మాత.పరాశక్తికి మొరపెట్టుకున్నారు.

దీంతో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరడంపై ఆసీనురాలై లలితాంబిక నామధేయంతో ఆవిర్భవించింది.

పాండాసురునితో భీకరంగా పోరుచేసి అతన్ని సంహరించింది.తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు.

లయకారకుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సుచేసి ప్రశాంతంగా.అత్యంత దయామయురాలిగా మారింది.

అనంతరం వాన్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజచేయమని కోరింది.ఈ సహస్రనామాలనే నేడు లలితాస్తోత్రంగా పిలుస్తున్నాం.

దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు… క్షమించండి యాంకర్ శ్రీముఖి వీడియో వైరల్!