Krithi Shetty : కృతి శెట్టి అసలు పేరు అది కాదా.. ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా?
TeluguStop.com
ఉప్పెన( Uppena ) సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి శెట్టి( Krithi Shetty ) .
బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కృతి శెట్టి అనంతరం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.
ఉప్పెన సినిమాలో బేబమ్మగా అందరికీ పరిచయమైనటువంటి ఈమెను ఇప్పటికే అభిమానులు ముద్దుగా బేబమ్మ అంటూనే పిలుస్తుంటారు.
ఇక ఈ సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
"""/"/ ఈ క్రమంలోనే కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం తమిళ భాష చిత్రాలలో కూడా ఈమె నటిస్తూ ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కృతి శెట్టికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కృతి శెట్టి అసలు పేరు( Krithi Shetty Real Name ) ఇది కాదని తెలుస్తుంది.
ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఈ పేరును పెట్టుకున్నారట అసలు ఈమె తన పేరును కాకుండా ఈ పేరు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.
"""/"/
కృతి శెట్టి అసలు పేరు అధ్వైత (Advaitha).అయితే తన పేరును అందరూ సరిగా పలకకపోవడంతో న్యూమరాలాజీ ప్రకారం తన పేరును కృతి శెట్టిగా మార్చుకుందంట.
ఇలా న్యూమరాలజీ ప్రకారమే తన పేరును మార్చుకోవడంతో పలువురు అభిమానులు ఈమె పేరు మార్చుకోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
బేబమ్మ వ్యవహారం చూస్తుంటే జాతకాలను బాగా నమ్ముతారని అనిపిస్తుంది అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు.
అద్భుతం, పంది కిడ్నీ మార్పిడి తర్వాత.. అలబామా మహిళ జీవితంలో ఊహించని మార్పు?