Nathanya Singh:గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తో చిందులు వేసిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు.అవకాశాలు రాకపోవడంతో చాలామంది సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే ఈ మధ్య కాలంలో దూరం అయిన సెలబ్రిటీలు సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తుండగా కొందరు ఇప్పటికీ అలాగే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూరమైన వారిలో నతాన్య సింగ్( Nathanya Singh ) కూడా ఒకరు.
నతాన్య సింగ్ చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో( Gudumba Shankar Movie ) కిళ్ళి కిళ్ళి అనే పాటలో( Killi Killi Song ) చిందులు వేసిన ముద్దుగుమ్మ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
"""/" /
ఈ ఒక్క పాటతో ఊహించిన విధంగా పాపులారిటీని సంపాదించుకుంది నతాన్య సింగ్.
ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు చిందులు వేసింది.కాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది.
కన్నడలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ యాక్టర్ లతో నటించింది.
తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.2008లో వచ్చిన బుద్దివంత చిత్రం లో నతాన్య సింగ్ నటించింది.
ఆ తరువాత మళ్లీ సినిమాలు చేయలేదు.అయితే తాజాగా నతాన్య సింగ్ హాట్ ఫోటోలతో నెట్టింట వైరల్ గా మారింది.
"""/" /
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటించడంతోపాటు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ నటించిన గుడుంబా శంకర్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
తనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు పవన్.అంతేకాకుండా ఇందులో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
అలాగే గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!