NTR : ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా… ఎవరు ఊహించలేరుగా… ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తాము పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని ఆరాటపడుతూ ఉంటారు.

ప్రతి ఒక్క హీరో హీరోయిన్లకు కూడా ఈ విధమైనటువంటి డ్రీమ్ రోల్స్ ఉంటాయి.

ఇలా ఆ డ్రీమ్ రోల్ లో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

అలాంటి అవకాశాలు వస్తే అసలు వదులుకోరనే చెప్పాలి.ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్( NTR )కి కూడా ఈ విధమైనటువంటి ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ( Tarakaramarao ) నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా అడుగుపెట్టినటువంటి ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు.

ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తూ అద్భుతమైన నటనను కనపరుస్తున్నారు.

ఇలా స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గాను గ్లోబల్ స్టార్ గాను గుర్తింపు పొందారు.

"""/" / ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర( Devara ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఈ పాత్రలో నటించడం కోసం ఎదురుచూస్తున్నారట ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించే అవకాశం రాలేదని తెలుస్తుంది.

మరి ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటి అనే విషయానికి వస్తే. """/" / ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు అయితే తన తాత గారిని కృష్ణుడి ( Krishana ) పాత్రలో చూసినటువంటి ఎన్టీఆర్ ఎంతో ఆశ్చర్యపోతూ తాను కూడా ఇలాంటి పాత్రలో నటించాలని కోరుకున్నారట.

అప్పటినుంచి కృష్ణుడి వేషంలో కనిపించే పాత్రలు ఎన్టీఆర్ కి అసలు రాలేదు బృందావనం ( Brindavanam )సినిమాలో ఈయన కృష్ణడిగా కనిపించినప్పటికీ అది ఫుల్ లెన్త్ సినిమా కాదు దీంతో ఈయన కృష్ణుడిగా కనిపించాలన్న కోరిక అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది.

మరి ఎన్టీఆర్ కోరికను ఏ డైరెక్టర్ తీరుస్తారో తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్యే Vs మాజీ ఎంపీ… రాజమండ్రిలో ప్రమాణాల సవాల్ !