కమెడియన్ సునీల్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా అదేనా..?
TeluguStop.com
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కంటెంట్ లేని సన్నివేశాన్ని కూడా వినోదభరితంగా చెయ్యగల సత్తా ఉన్న కమెడియన్స్ కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు.
వారిలో ఒకరు సునీల్.( Comedian Suneel ) ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి భీమవరం నుండి హైదరాబాద్ కి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం తెగ కష్టపడి,తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోయినా కూడా ఆకలి కడుపుతోనే స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాలను సంపాదించుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నాడు.
వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ నేడు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి ఎదిగాడు.
ఇది సాధారణమైన విషయం కాదు.అయితే సునీల్ సినిమాల్లోకి కమెడియన్ అవుదామని రాలేదు, విలన్ అవుదామని వచ్చాడు.
కానీ విధి అతనిని తొలుత కమెడియన్ ని చేసింది, ఆ తర్వాత హీరో ని చేసింది.
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో విలన్ గా కూడా రాణిస్తున్నాడు.ఇలా అన్నీ విభాగాలలో తన సత్తా చాటి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
"""/" /
ఇదంతా పక్కన పెడితే సునీల్ హీరో గా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆయన హీరో గా నటించిన 'అందాల రాముడు', 'పూలరంగడు' మరియు 'మర్యాదరామన్న' వంటి చిత్రాలు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాలే.
హీరో గా అశేష ప్రేక్షాభిమానం పొందిన తర్వాత ఆయన విలన్ గా కూడా ఇప్పుడు రాణిస్తున్నాడు.
అయితే సునీల్ హీరో గా నటించిన సినిమాలలో 'జక్కన'( Jakkanna Movie ) అనే చిత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది.
ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ, ఓపెనింగ్స్ పరంగా మాత్రం దుమ్ములేపేసింది.
ఏ రేంజ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది అంటే, చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు ఇప్పటికీ అంత ఓపెనింగ్ రాలేదు అన్నమాట.
ఈ సినిమాకి దర్శకుడిగా వంశీ కృష్ణ ఆకెళ్ళ( Vamsi Krishna Akella ) వ్యవహరించాడు.
ఇతను ఇండస్ట్రీ కి కొత్త దర్శకుడు. """/" /
అయితే సినిమా ఔట్పుట్ చాలా సన్నివేశాల వరకు సరిగా రాకపోవడం తో సునీల్ స్వయంగా చాలా సన్నివేశాలకు ఇన్ పుట్స్ ఇచ్చాడట.
కొన్ని సన్నివేశాలకు ఆయన దర్శకత్వం ( Direction ) కూడా వహించినట్టు తెలుస్తుంది.
చిత్రం చూసేందుకు బాగానే ఉంటుంది కానీ, సునీల్ ని అలాంటి క్యారక్టర్ లో చూసి చూసి జనాలకు బాగా బోర్ కొట్టేసింది.
అందుకే ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ రేంజ్ ని అందుకోలేకపోయింది.
ఇక ఆ తర్వాత కూడా హీరో గా సునీల్ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.
ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు.
కానీ డిఫరెంట్ తరహా పాత్రలు వరుసగా రావడం తో ఇలా షిఫ్ట్ అయ్యాడు.
ఈయన హీరోగా కనిపించిన ఆఖరి చిత్రం సిల్లీ ఫెలోస్.ఇందులో అల్లరి నరేష్ కూడా మరో హీరో గా నటించాడు.
రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న ఇద్దరు బాలీవుడ్ హీరోలు…