Pelli Pusthakam Movie: బాపు-రమణల ‘పెళ్లి పుస్తకం’ సినిమా ఐడియా ఏమిటో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది!

తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.అలాంటి సినిమాల్లో పెళ్లి పుస్తకం సినిమా( Pelli Pusthakam Movie ) ఒకటి.

ఈ సినిమా 1991 లో విడుదలైన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా అప్పట్లోనే ఒక క్లాసిక్.

అంతే కాదు అప్పటివరకు ప్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ కెరీర్ మళ్ళీ ఈ సినిమాతోనే టర్నింగ్ అయ్యింది అనొచ్చు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెటింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దర్శకుడు బాపు( Director Bapu ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కాంబోలో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.వీరి కాంబోలోనే పెళ్లి పుస్తకం వచ్చింది.

ఈ సినిమా వీరి కెరీర్ లలో ఒక క్లాసిక్.ఎమోషన్ ప్రధాన అంశాలుగా పెళ్లి పుస్తకం తెరకెక్కింది.

ఈ సినిమాతో ఇండస్ట్రీలో వీరి పేర్లు మారుమ్రోగాయి.రమణ( Ramana ) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.

ఆయన నిర్మాత కూడా.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడమే కాక మంచి కలెక్షన్స్ ని కూడా సాధించింది.

చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది.ఈ సినిమాలో ఒకరిపై మరొకరికి ప్రేమ వలన కలిగే అసహనం, కోపం చాలా రొమాంటిక్ గా చూపించారు.

ఈ సినిమాకి ‘శ్రీరస్తు శుభమస్తు’ సాంగ్ ఆల్ టైం హిట్.ఇప్పటి పెళ్లి వీడియోల్లో, వేడుకల్లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

"""/" / అయితే ఈ కథను నటుడు రావి కొండలరావు అందించారు.ఈ కథను మిస్సమ్మ కథ( Missamma Movie ) స్ఫూర్తితో కథను సిద్ధం చేయాలనే ప్రతిపాదన బాపు, రావి కొండలరావు ముందు పెట్టారట.

మిస్సమ్మ మూవీలో ఎన్టీఆర్-సావిత్రి ఉద్యోగం కోసం మొగుడు పెళ్ళాంగా నటించారు అని అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మాత్రం పెళ్ళైన రాజేంద్ర ప్రసాద్-దివ్యవాణి ఓకే ఆఫీస్ లో పరిచయం లేని వాళ్ళుగా నటించారు.

"""/" / అందుకే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తాయి.పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) హ్యూమర్, టాలెంట్ కి సింధుజ ఇంప్రెస్ అవుతుంది.

దీంతో అతని వెంట పడుతుంది.ఇది భార్యగా దివ్యవాణి( Divya Vani ) చూడలేకపోతుంది.

ఇలా ఎన్నో పోలికలు ఈ సినిమాల మధ్య కనిపిస్తాయి.కానీ పెళ్లి పుస్తకం చాలా ఫ్రెష్ స్టోరీ.

అందుకే ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు.మిస్సమ్మను గుర్తు చేయదు.

అయాన్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!