శ్రావణ మంగళవారం అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరమ్మని ఎలా పూజించాలో తెలుసా..?

శ్రావణమాసంలో( Sravanamasam ) వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం మన దేశంలోని మహిళలు అత్యంత పవిత్రంగా భావిస్తారు.

మంగళ గౌరీ వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.శ్రావణ మంగళవారాలలో వివాహిత మహిళలు అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీవ్రతాన్ని ఆచరిస్తారు.

అయితే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం రావడంతో 9 మంగళవారాలు( 9 Tuesdays ) వస్తాయి.

ప్రస్తుతం అధిక శ్రావణమాసం నడుస్తుంది.వివాహిత మహిళలు గౌరమ్మని పూజిస్తే అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని, వివాహం కాని అమ్మాయిలు మంచి వరుడుని పొందేందుకు, త్వరగా పెళ్లి అవ్వడం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

ఏ పద్ధతిలో వివాహమైన మహిళలు అఖండ సౌభాగ్యాన్ని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అఖండ సౌభాగ్యాన్ని పొందడానికి శ్రావణ మంగళవారం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీవ్రతాన్ని( Mangala Gourivratam ) ఆచరిస్తారు.

వ్రతం చేసే సమయంలో తప్పకుండా మంగళ గౌరీ కథను వినాలి.ఈరోజు అన్ని ఆచరించిన భక్తుల పట్ల పార్వతి దేవి అనుగ్రహం ఉంటుందని, తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని, పిల్లలకు దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది మహిళలు నమ్ముతారు.

ఈ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ గౌరీవ్రతాన్ని తప్పనిసరిగా కొత్త వధువులతో చేయిస్తారు.

"""/" / మంగళ గౌరీవ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి పండ్లు, పూలు, తాంబూలం, లడ్డూలు, శనగలు, 16 గాజులు, పువ్వులను సమర్పించాలి.

పూజలో 16 తోరణాలు సమర్పించడం వల్ల అమ్మవారికి సంతోషం కలుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

మంగళగౌరీ వ్రత చదివి భక్తిశ్రద్ధలతో పూజలు చేయాల్సి ఉంటుంది.ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయని, సంతానం లేని వారు సంతానాన్ని పొందుతారని చాలామంది ప్రజలు నమ్ముతారు.

"""/" / శ్రావణమాసంలో మంగళవారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ముందుగా స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి.

పీఠాన్ని ఏర్పరచి ఎర్రటి వస్త్రాన్ని పరిచి గౌరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.పళ్లెంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై నవగ్రహాలను ఏర్పాటు చేయాలి.

అలాగే కలశం ఏర్పాటు చేయడం బియ్యం పిండితో దీపం చేసి పూజలో ఉంచాలి.

ఈ విధంగా పూజించడం ద్వారా పార్వతి మాత అనుగ్రహంతో వివాహిత మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు.

కేంద్రాన్ని ఒప్పించిన బాబు … అమరావతికి మహర్దశ