అదిరిపోయిన గూగుల్‌ ఫొటోస్‌ అప్‌డేట్‌ గురూ.. తెలిసిందా?

నేడు స్మార్ట్‌ ఫోన్‌( Smart Phone ) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతోందని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు.

పామరులనుండి పండితుల వరకు అందరూ దీనిని వాడడం పరిపాటిగా మారింది.ఇక ఈ స్మార్ట్‌ ఫోన్లు అనేవి ఎక్కువ శాతం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతాయనే విషయం విదితమే.

ఇక ప్రముఖ కంపెనీ అయిన గూగుల్‌ ( Google )ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

దీంతో గూగుల్‌ వినియోగదారులకోసం ఫోన్లో వివిధ రకాల యాప్స్‌ అందుబాటులో ఉంచింది.ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ అంటే కాల్‌, మెసేజ్‌ అవసరాలకే కాకుండా ఫొటోలకు కూడా ఎక్కువగా వాడుతున్న పరిస్థితి.

"""/" / ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెల్ఫీ ట్రెండ్‌ అనేది ఎక్కువగా నడుస్తుంది.

కాబట్టి ఫోన్‌ మెమోరీ చాలా స్పీడ్‌గా ఫుల్‌ అయ్యిపోతుంది.దీంతో యూజర్లు ఫోన్‌ మెమోరీ ఖాళీగా ఉంచుకోవడంతో పాటు తమ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడానికి వివిధ యాప్స్‌పై ఆధారపడుతున్న పరిస్థితి వుంది.

ఈ ఇబ్బంది నుంచి అధిగమించడానికి అందరూ గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌పై ( Google Photos App )ఆధారపడుతున్నారు.

గూగుల్‌ కూడా తన ఫొటోస్‌ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ అప్‌డేట్‌ ముఖ్యంగా గూగుల్‌ ఫొటోస్‌ లవర్స్‌ను బాగా ఇంప్రెస్‌ చేస్తుంది.

"""/" / ఫొటో షేరింగ్‌, స్టోరేజ్‌ సర్వీసులు అందిస్తున్న గూగుల్‌ ఫొటోస్‌లో తాజాగా ఎడిటింగ్‌ సూట్‌కు 12 వీడియో ఎఫెక్టులను జోడించడం విశేషం.

ఇక కొత్త వీడియో ఎఫెక్ట్స్‌లో డస్ట్‌ మాక్స్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫిల్మ్‌, లైట్‌ లీక్‌ వంటి 12 రకాల ఎఫెక్ట్స్‌ ఉన్నాయి.

ఈ తాజా అప్‌డేట్‌తో వినియోగదారులకు వారి వీడియోలను వ్యక్తిగతీకరించే సామర్థ్యాన్ని అందించాలని అనుకుంటోంది.

సాంప్రదాయ ప్లే, పాజ్‌ బటన్‌లతో పాటు ముందుకు వెనకకు దాటవేయడానికి అంకితమైన బటన్లను చేర్చింది.

అలాగే కంపెనీ ఫ్లోటింగ్‌ బాక్స్‌ డిజైన్‌ను కూడా తొలగించింది.కస్టమర్లు ప్రొఫైల్‌ మెనూను యాక్టివేట్‌ చేసినప్పుడు కనిపించే పూర్తి స్క్రీన్‌ వీక్షణను జోడించింది.

ఇలాంటి డైనమిక్‌ ఫీచర్ల వల్ల వినియోగదారులు తమ ఫొటోలను పర్‌ఫెక్ట్‌గా ట్యూన్‌ చేసి అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ రూపొందించడానికి వీలు కల్పిస్తాయి.

పొడి చర్మంతో దిగులొద్దు.. రోజు నైట్ ఈ ఆయిల్ ను వాడితే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే!