కరోనా వల్ల పోగొట్టుకున్న రుచి, వాసన సామర్థ్యాలను మళ్లీ ఎలా పొందాలో తెలుసా?
TeluguStop.com
కరోనా వైరస్.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే ఎందరినో పొట్టన పెట్టుకుని లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
మరెందరినో ఉపాధి కోల్పోయేలా చేసి రోడ్డున పడేసింది.ఇదిలా ఉంటే.
కరోనా సోకిన వారు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడటమే కాదు రుచి, వాసన సామర్థ్యాలను సైతం కోల్పోతుంటారు.
అయితే కరోనా నుంచి కోలుకున్నాక కొందరు మళ్లీ ఆ సామర్థ్యాలను పొందలేకపోతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే గనుక కరోనా కారణంగా పోగొట్టుకున్న రుచి, వాసన గ్రహించే శక్తిని తిరిగి పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.పోయిన రుచి, వాసన సామర్థ్యాలను మళ్లీ తిరిగి తీసుకురావడానికి అల్లం గ్రేట్‌గా సహాయపడుతుంది.
చిన్న అల్లం ముక్కను తీసుకుని పైతొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇప్పుడు అల్లం ముక్కను తేనెలో ముంచి.
ఆపై దానిని బాగా నమిలి తినాలి.ఇలా ప్రతి రోజు ఉదయాన్నే చేస్తే గనుక.
అందులోని ప్రత్యేక సుగుణాలు రుచి, వాసన పసిగట్టే శక్తిని తెస్తాయి. """/"/
ఒక గిన్నెలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆముదంను తీసుకుని లైట్‌గా హీట్ చేయాలి.
ఇప్పుడు హీట్ చేసుకున్న ఆముదాన్ని గోరు వెచ్చగా మార్చి.అప్పుడు ముక్కు రంద్రాల్లో ఒక చుక్క చప్పున రోజుకు రెండు సార్లు వేసుకోవాలి.
ఇలా చేస్తే వాసన గ్రహించే సామర్థ్యం మళ్లీ వస్తుంది.అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టును తొలగించి మెత్తగా దంచుకోవాలి.
ఆ తర్వాత గ్లాస్ వాటర్‌లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి.
ఇప్పుడు మరిగిన నీటిని ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్‌గా సేవించాలి.ఇలా ప్రతి రోజు ఉదయాన్నే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టే క్రీమ్ ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండి..!