చాలా సులభంగా బరువు తగ్గే.. ఈ షేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?
TeluguStop.com
సాధారణంగా చాలామంది శరీర బరువు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు.శరీర బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఎన్నో డైట్ ప్లాన్ లు ఫాలో అవుతున్నారు.అయినప్పటికీ కూడా బరువు తగ్గలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అయితే బరువు తగ్గడానికి సపోటా చాలా మేలు చేస్తుంది.సపోటా ( Sapota Fruit )శరీరానికి చాలా మంచిది.
ఇది శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలను అందిస్తుంది.ఎందుకంటే ఇందులో విటమిన్ బి,సి,ఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధిక పరిమాణంలో ఉన్నాయి.
అందుకే వీటిని ప్రతి రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
"""/" /
సపోట అనే కాకుండా ఆ సపోటా పీల్స్ తో తయారు చేసిన రసం అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
ఈ షేక్ లో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థకు ఆరోగ్యంగా ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ పీల్ షేక్ లో ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉంటాయి.అందుకే శరీర బరువును తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది.
అది మాత్రమే కాకుండా జీర్ణక్రియ సమస్య( Digestive Problems )ను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా దోహదపడుతుంది.
అయితే సపోటా పీల్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
సపోటా పీల్ షేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కడిగిన సపోటా పీల్స్ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్( Cocoa Powder ), మూడు కప్పుల పాలు, ఒక టీ స్పూన్ చక్కెర, 7 నుంచి 8 ఐస్ క్యూబ్స్, సపోట పీల్ షేక్ తయారీ పద్ధతి: ముందుగా సపోట పీల్స్ తీసుకోవాలి.
ఆ తర్వాత వాటిని బాగా కడిగి గ్రైండ్ చేయాలి.గ్రైండ్ చేసే సమయంలో పాలను వేసి బాగా మిక్స్ చేయాలి.
ఆ తర్వాత పంచదార, నాలుగు ఐస్ క్యూబ్, ఒక టీ స్పూన్ కోకో పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
ఇలా మిక్స్ చేసినదాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగాలి.
ఇలా తరచూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఆరోగ్యానికి మంచిదని పనీర్ ను పదేపదే తింటున్నారా.. అయితే డేంజరే..!