పాలు లేకుండా పన్నీర్ తయారు చేయడం ఎలాగో తెలుసా..?
TeluguStop.com
పన్నీర్( Paneer ) తో చేసిన ఏ వంట అయినా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.
ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.పన్నీర్ పాలతో చేస్తారు.
అసలు పాలు లేకుండా పన్నీరు చేయవచ్చా? పాలు లేకుండా పన్నీర్ ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా.
ఇంట్లో పన్నీరు చేయడానికి తగినంత పాలు లేకపోయినా మీరు పన్నీర్ చేయవచ్చు.పాలు లేకుండా పన్నీరు ఎలా తయారు చేయాలి.
అందుకు సంబంధించిన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇలా చేయడానికి వేరుశనగ పావు కేజీ, అలాగే వెనిగర్, ( Vinegar )శుభ్రమైన కాటన్ క్లాత్ ఉండాలి.
ముందుగా వేరుశనగను( Peanut ) ఆరు నుంచి ఏడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
"""/" /
ఆ తర్వాత నీళ్లతో మూడు, నాలుగు సార్లు కడగాలి.మిక్సీలో బాగా రుబ్బాలి.
దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.నీళ్లు పోసి బాగా రుబ్బాలి.
వేరుశనగ పాలు సిద్ధం అయిన తర్వాత గ్యాస్ మీద చిన్న మంట పెట్టి వేడి చేయాలి.
దానిని క్రింద ఉంచి శుభ్రమైన కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి.ఆ తర్వాత మళ్లీ స్టవ్ మీద వేడి చేయాలి.
వేరు శనగ పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ ( Vinegar )వేసి కలపాలి.
వేరుశనగ పాలు దిగువకు వెళ్లకుండా బాగా కలుపుతూ ఉండాలి.నిమ్మరసం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు.
పాలు విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. """/" /
ఇక గుడ్డ ద్వారా విరిగిన పెరుగు పాలను వడకట్టండి ఉడకట్టాలి.
ఒక ప్లేట్ మీద ఉంచి దానిమీద ఏదైనా బరువైన వస్తువు ఉంచితే క్లాత్ నుంచి పాలు బయటకు వస్తాయి.
లోపల విరిగిపోయిన పాలు మాత్రమే ఉంటాయి.దాన్ని ఫ్రిజ్లో పెడితే గట్టిగా తయారవుతుంది.
దీంతో మీకు కావాల్సిన వంటకాలు చేసుకోవచ్చు.ఇది మామూలు పాలతో చేసిన దాని కంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?