ఇంట్లోనే స‌న్ స్క్రీన్ ను ఈజీగా ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో తెలుసా?

సీజ‌న్ ఏదైనా చ‌ర్మానికి స‌న్ స్క్రీన్ లోష‌న్‌ను త‌ప్ప‌కుండా రాసుకోవాలి.అందులోనూ ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో స‌న్ స్క్రీన్ లేకుండా బ‌య‌ట‌కు వెళ్తే చ‌ర్మం ప‌ని అయిపోయిన‌ట్లే.

స‌న్ స్క్రీన్‌ను వాడ‌టం వ‌ల్ల ట్యాన్ స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.చ‌ర్మంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

స్కిన్ మృదువుగా, తేమ‌గా ఉంటుంది.యూవీ కిరణాల ప్రభావం చర్మంపై నేరుగా పడకుండా అడ్డుకుంటుంది.

అందుకే స్కిన్‌కు త‌ప్ప‌కుండా స‌న్ స్క్రీన్‌ను వాడాల‌ని చ‌ర్మ నిపుణులు చెబుతుంటారు.అయితే స‌న్ స్క్రీన్ అంటే బ‌య‌ట షాప్స్‌లో దొరికేవే వాడాల్సిన అవ‌స‌రం లేదు.

ఇంట్లో త‌యారు చేసుకున్న న్యాచుర‌ల్ స‌న్ స్క్రీన్ ను సైతం యూస్ చేయ‌వ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఇంట్లోనే స‌న్ స్క్రీన్ ను ఈజీగా ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.క‌డిగిన క్యారెట్‌ను స‌న్న‌గా తురుముకుని పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర క‌ప్పు కొబ్బ‌రి నూనె, అర క‌ప్పు బాదం నూనె, క్యారెట్ తురుము వేసుకుని ప‌ది నిమిషాల పాటు ఉడికిస్తే ఆయిల్ క‌ల‌ర్ ఛేంజ్ అవుతుంది.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఆయిల్‌ను స్ట్రైన‌ర్ సాయంతో స‌ప‌రేట్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కోకో బ‌ట‌ర్ వేసి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో మెల్ట్ చేసుకోవాలి.

"""/" / మెల్ట్ అయిన కోకో బ‌ట‌ర్‌లో రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుని స‌న్ స్క్రీన్ సిద్ధ‌మైన‌ట్టే.

దీనిని ఒక బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

కాబ‌ట్టి, ఈ న్యాచుర‌ల్ స‌న్ స్క్రీన్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

KCR : మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి..: కాంగ్రెస్ నేతలు