వింటర్ లో వేధించే విటమిన్ డి లోపానికి ఎలా చెక్ పెట్టాలో తెలుసా?

చలికాలం( Winter )పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి ఇష్టమైన సీజన్.

బయట చలి పులి పంజా విసురుతుంటే.లోపల దుప్పటి కప్పుకుని వెచ్చగా నిద్రిస్తుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

అయితే వింటర్ సీజన్ వస్తూ వస్తూనే దానితో పాటు కొన్ని జబ్బుల‌ను కూడా తీసుకొస్తుంది.

ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రధానంగా వేధించే సమస్యల్లో విటమిన్ డి లోపం ఒకటి.

విటమిన్ డి కి గొప్ప మూలం సూర్యుడు.సూర్యరశ్మి ద్వారా మనం విటమిన్ డి పొందవచ్చు.

"""/" / కానీ చలికాలంలో సూర్యుడు చాలా తక్కువగా ఉంటాడు.అందుకే పిల్లలు నుంచి పెద్దల వరకు ఎంతో మంది విటమిన్ డి లోపాలకి గురవుతుంటారు.

విటమిన్ డి( Vitamin D ) లోపం కారణంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.

సీజనల్ వ్యాధులు అన్ని చుట్టుముడతాయి.ఎముకలు బలహీనంగా తయారవుతాయి.

ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.వీటికి దూరంగా ఉంటూ విటమిన్ డి లోపానికి చెక్ పెట్టాలి అంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ప్రయత్నించండి.

నిజానికి సూర్యుడు ద్వారానే కాకుండా కొన్ని ఆహారాల ద్వారా కూడా విటమిన్ డి ను పొందవచ్చు.

ముఖ్యంగా పెరుగు, ఆరెంజ్ జ్యూస్( CURD ), తృణధాన్యాలు, పుట్టగొడుగులు, స్వచ్ఛమైన ఆవు పాలు, మొక్కలు ఆధారిత పాలు, సాల్మన్ చేపలు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

అందువల్ల చలికాలంలో ఈ ఆహారాలను అస్సలు మిస్ అవ్వకండి.తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.

అలాగే చలికాలంలో ఉదయం ఎలాగో సూర్యుడు కనిపించడు. """/" / అయితే మీరు 10 గంట‌ల నుంచి 12 వరకు వచ్చే ఎండలో విటమిన్ డి కోసం ప్రయత్నించవచ్చు.

మీ 10% శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకుంటే విటమిన్ డి అందుతుంది.

కానీ, ఎండలోకి వెళ్ళేటప్పుడు కచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి.ఇక కేవలం ఆహారమే కాకుండా సప్లిమెంట్స్ ను కూడా తీసుకోవాలి.

మనకు విటమిన్ డి సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి.వైద్యులు కూడా వింటర్ సీజన్ లో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తున్నారు.

ద్వారా విట‌మిన్ డి లోపాన్ని స‌మ‌ర్థ‌వంతంగా జ‌యించ‌వ‌చ్చు.

మలబద్ధకంతో ఇక నో వర్రీ.. ఈజీగా ఇలా చెక్ పెట్టండి!