హార్మోన్ల అసమతుల్యత వ‌ల్ల వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు ఏ విధంగా చెక్ పెట్టాలో తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది మ‌హిళ‌లు హార్మోన్ల అసమతుల్యతకు గుర‌వుతున్నారు.దీని కార‌ణంగా థైరాయిడ్‌, పిసిఒఎస్, గర్భం ధరించక పోవడం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అలాగే హార్మోన్ల అసమతుల్యత వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్ వంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌నూ ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆయా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎలా వ‌దిలించుకోవాలో తెలీక చాలా మంది మ‌హిళ‌లు మాన‌సికంగా కృంగిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటే గ‌నుక హార్మోన్ల అసమతుల్యత వ‌ల్ల వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు సుల‌భంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండి.హార్మోన్ల అసమతుల్యత ఉన్న వారు మొద‌ట డైట్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

డైట్‌లో తాజా ఆకుకూర‌లు, పండ్లు, కూర‌గాయ‌లు, తృణధాన్యాలు, గ్రీన్ టీ, న‌ట్స్‌, గుడ్డు, బీన్స్‌, మొల‌కెత్తిన విత్త‌నాలు, పుట్ట‌గొడుగులు, పుచ్చ గింజ‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి.

అదే స‌మ‌యంలో ఉప్పు, షుగర్‌, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

మాంసాహారాన్ని తిన‌డం కూడా త‌గ్గించాలి. """/" / అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి నిద్ర ఎంతగానో అవ‌స‌రం అవుతుంది.

అందుకే ప్ర‌తి రోజు క‌నీసం ఏడు గంట‌ల పాటు నిద్రించాలి.ఒత్తిడికి వీలైనంత వ‌ర‌కు దూరంగా ఉండాలి.

ప్ర‌తి రోజు యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయాలి.స్మార్ట్‌ఫోన్ల‌ను వినిగించ‌డం త‌గ్గించాలి.

చ‌ర్మానికి నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌నే వాడాలి.మ‌రియు శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

అందుకోసం రోజుకు రెండు నుంచి మూడు లీట‌ర్ల నీటిని సేవించాలి.ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో హార్మోన్ల‌ సమతుల్యం అవుతాయి.

ఫ‌లితంగా నల్లని మచ్చలు, మొటిమలు, పొడి చ‌ర్మం, పిగ్మెంటేషన్, అవాంఛిత రోమాలు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉశ‌మ‌నం ల‌భిస్తుంది.

Allu Arjun : అల్లు అర్జున్ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?