ఈ పాత సినిమాల్లో విలన్లు ఎలా ఉండేవారో తెలుసా?

సాధారణంగా సినిమాలలో హీరోలకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.

ఇలా హీరోలకు ధీటుగా విలన్ లను ఎంపిక చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరో స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటేనే విలన్ పాత్రను ప్రేక్షకులు ఆస్వాదిస్తూ సినిమాలకు మంచి విజయాన్ని అందిస్తున్నారు.

అందుకోసమే ప్రస్తుతం దర్శక నిర్మాతలు హీరోతో పాటుగా రెమ్యూనరేషన్ చెల్లిస్తూ విలన్ లను ఎంపిక చేసుకుంటున్నారు.

కొన్ని సినిమాలను మరొక స్టార్ హీరో ని విలన్ గా మారి హీరోతో పోటీకి దిగుతున్నారు.

ప్రస్తుత కాలంలో ఈ విధంగా హీరోలకు విలన్లకు పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

అయితే పాత కాలంలో విలన్ పాత్రలు ఎంతో వైద్య భరితంగా ఉండేది.ఇలా పాత సినిమాలలో విలన్ లూ రెండు రకాలుగా ఉండేవారు.

ఇంటి విలన్లు, డెన్ విలన్లు.ఇక ఇంటి విలన్లు కేవలం కుటుంబ సభ్యులకు గొడవలు పడుతూ హీరోహీరోయిన్ల విడదీయడం హీరోని అవమానపరుస్తూ రెచ్చగొట్టడం, భూములను ఆక్రమించడం, రౌడీలతో హీరోలపై దాడి చేయించడంవంటివి చేస్తుంటారు.

ఇక డెన్ విలన్ల విషయానికి వస్తే వీరు ఒక పెద్ద మాఫియాను మెయింటెన్ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు.

"""/" / ఈ విధమైనటువంటి విలన్ లు స్మగ్లింగ్, బ్యాంకు దోపిడీలు వంటి తరహాలో ఇంటర్నేషనల్ యాక్టివిటీలో పాల్గొంటూ మనకు కనబడతారు.

ఈ విధంగా ఎన్నో స్మగ్లింగ్ చేస్తూ విలన్లుగా కనపడే వీరు చివరికి హీరో చేతిలో అడ్డంగా దొరికిపోతారు చివరికి వెర్రి మొహాలు వేసుకునేలా వారి పాత్రలను సృష్టిస్తూ ఉంటారు.

ఈ విధంగా ఎన్నో తెలివితేటలు ఉన్నటువంటి విలన్లను మోసం చేయడానికి హీరోలు ఎత్తులకు పై ఎత్తులు వేయడమే కాకుండా, వివిధ రకాల మారువేషాల్లో వస్తూ విలన్ ల ఆట కట్టిస్తుంటారు.

"""/" / ఈ విధంగా పాతకాలం సినిమాలలో విలన్ లు ఈ విధంగా ఉండేవారు.

అప్పట్లో ప్రతి ఒక్క సినిమాలో ఈ విధంగా రెండు రకాలుగా విలన్లు ఉంటూ ఓకే కాన్సెప్టుతో విలన్ పాత్రను రూపొందించేవారు.

అయితే ప్రస్తుతం విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా విలన్ పాత్రలను ఎంతో విభిన్నంగా రూపొందిస్తూ హీరోలకు దీటుగా విలన్ పాత్రలను సృష్టిస్తున్నారు.

ఈ విధంగా పాత కాలంలో విలన్ పాత్రలకు ఇప్పటి విలన్ పాత్రకు ఎంతో తేడా ఉందనీ చెప్పవచ్చు.

"""/" / ఇలా పాతకాలంలో రావు గోపాల్ రావు, రాజనాల, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, సూర్యకాంతం, నాగభూషణం, ఛాయా దేవి వంటి వారు ఈ విధమైనటువంటి విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ అప్పట్లో ప్రేక్షకులను మెప్పించారు.

ఈ విధంగా రెండు రకాల విలన్ పాత్రలలో నటించి అప్పట్లో అందరిని మెప్పించారు.

మరోసారి తల్లైనా బుల్లితెర నటి మహేశ్వరి..వైరల్ అవుతున్న పోస్ట్!