జుట్టు వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసా? ఒక కిలో జుట్టు ఖరీదు ఎంతో తెలిస్తే..

మీ తలపై వెంట్రుకలు ఉన్నంత కాలం మీరు దానికి చాలా విలువ ఇస్తారు.

కానీ జుట్టు రాలిన తర్వాత దానిని విసిరివేస్తారు.అలాగే సెలూన్‌లో వదిలివేస్తారు.

కొంద‌రు ఆలయాల్లో జుట్టును స‌మ‌ర్పించుకుంటారు.మీరు పనికిరానిదిగా భావించే జుట్టుతో కోట్లాది రూపాయల వ్యాపారం జ‌రుగుతోంది.

కిలో జుట్టు 25 వేల నుండి 30 వేల రూపాయలు ప‌లుకుతుంది.1840 సంవత్సరం నుండి జుట్టు వ్యాపారం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

ఆ సమయంలో, ఫ్రాన్స్‌లోని కంట్రీ ఫెయిర్‌లో జుట్టు కొనుగోలు చేసేవారు.ఈ ఫెయిర్‌లలో అమ్మాయిలు తమ జుట్టును వేలం వేసేవారు.

దీని తరువాత చాలా దేశాల నుండి అమ్మాయిలు జుట్టు అమ్మడం ప్రారంభించారు.భారతదేశంలో కోట్లాది రూపాయల జుట్టు వ్యాపారం జరుగుతోంది.

భారతీయ మహిళలకు పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టం.భారతదేశం నుండి చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మాలకు జుట్టు ఎగుమ‌తి అవుతుంది.

దానం చేసిన వెంట్రుకలు భారతదేశంలోని దేవాలయాలలో కూడా విక్ర‌య‌మ‌వుతాయి.వెంట్రుక‌ల‌ను సేక‌రించాక వాటిని శుభ్రంచేసి విదేశాలకు విక్రయిస్తారు.

విదేశాలలో ఈ వెంట్రుక‌ల‌తో విగ్గులు తయారు చేస్తారు.ఇటీవ‌లి కాలంలో విగ్గుల‌కు మ‌రింత‌గా డిమాండ్ పెరిగింది.

దీంతో జుట్టు క్ర‌య‌విక్ర‌యాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

సినిమాల ఎంపిక విషయం లో ప్రభాస్ ఎందుకు తొందరపడుతున్నాడు…