సద్దుల బతుకమ్మను ఎలా పేరుస్తారో తెలుసా..?
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ( Bathukamma Festival )ను ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.
అలాగే బతుకమ్మ పండుగ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
పితృ అమావాస్య రోజు మొదలయ్యే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను చేసి ఆడు పాడుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఎంగిలి పూల బతుకమ్మ( Engili Pula Bathukamma )తో మొదలైన ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది.
అలా 9 రోజులు చేసే బతుకమ్మకు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
ఈ తొమ్మిది రోజుల్లో 8 రోజులు జరుపుకునే బతుకమ్మ ఓక ఎత్తు అయితే 9వ రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు ( Scholars )చెబుతున్నారు.
"""/" /
అలాగే చివరి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ( Saddula Bathukamma )ను ఘనంగా జరుపుకుంటారు.
ఈ రోజున బతుకమ్మ పెద్దగా పేరుస్తారు.తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పువ్వు( Dandelion Flower )తో బతుకమ్మను సిద్ధం చేస్తారు.
అలాగే పెద్ద తాంబూలంలో బతుకమ్మను పేరుస్తారు.ముఖ్యంగా సద్దుల బతుకమ్మను పేర్చేటప్పుడు తంగడ పువ్వు, గానుగ, చామంతి, బంతి, గులాబీ, మందారం ఇలా దొరికినన్ని పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు.
దీనికి తోడుగా ఉండడానికి తోడు బతుకమ్మను కూడా పేరుస్తారు.ఇది చిన్న సైజులో చేస్తారు.
"""/" /
తర్వాత గౌరమ్మ( Gouramma )ను చేసి ఎండు కొబ్బెరలో పసుపు కొమ్ము, ఒక్క తో పాటు గౌరమ్మను పేరుస్తారు.
దీన్ని బతుకమ్మలో పెట్టి పూజిస్తారు.అలాగే సద్దుల బతుకమ్మ రోజున వివిధ రకాల నైవేద్యాలు చేస్తారు.
ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున మలిద ముద్దలు చేసి అమ్మ వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
కొందరు పిండి వంటలు చేసి ప్రసాదంగా సమర్పిస్తారు.అలాగే మహిళలు సాంప్రదాయ దుస్తువులలో సిద్ధమై బతుకమ్మ పండుగలో తమ ఆట పాటలతో సందడి చేస్తారు.
ఇంకా చెప్పాలంటే చివరికి బతుకమ్మను, గౌరమ్మను పూజించి నీటిలో సమర్పిస్తారు.
నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!