అంపైర్లకు ఐపీఎల్ లో ఎంత వేతనం ఇస్తారో తెలుసా..?

ఐపీఎల్ లో( IPL ) క్రికెట్ ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం వేలంలో ఫ్రాంచైజీలు కోట్లల్లో కాసుల వర్షం కురిపిస్తాయి.

అయితే క్రికెట్ కు ఆటగాళ్లతో పాటు, అంపైర్లు కూడా కీలకమే.క్రికెట్ ఆటగాళ్ల అంత కాకపోయినా వీరికి కూడా వేతనాలు ఆశాజనకంగానే ఉంటాయి.

గతంలో కంటే 2023 ఐపీఎల్ సీజన్లో క్రికెట్ ఆటగాళ్లతో పాటు అంపైర్లకు కూడా భారీగానే వేతనాలు పెరిగాయి.

ఐపీఎల్ లో క్రికెట్ ఆటగాళ్లకు వేతనాలు ఎంత ఇస్తారో చాలావరకు తెలిసిందే.ఇక అంపైర్ల విషయానికి వస్తే ఎలైట్ ప్యానెల్ అంపైర్లు( Umpires ), డెవలప్మెంట్ అంపైర్లు అనే రెండు గ్రేడ్లు ఉంటాయి.

ఐపీఎల్ లో ఉన్నతస్థాయి మ్యాచ్ లకు ఎలైట్ ప్యానల్ అంపైర్లు బాధ్యత వహిస్తారు.

అనుభవం లేని కొత్త వారిని డెవలప్మెంట్ అంపైర్లుగా నియమిస్తారు. """/" / గత సీజన్లో ఎలైట్ ప్యానెల్ అంపైర్లకు ప్రాథమిక వేతనం రూ.

1.75లక్షలు గా ఉండేది.

ఈ సీజన్లో రూ.23 వేల రూపాయలు పెరిగి రూ.

1.98లక్షలు గా ఉంది.

అంతేకాదు అదనంగా ప్రయాణ, వసతి ఖర్చులకోసం ప్రతి మ్యాచ్ కు రూ.12,500 ఉంటుంది.

ఎలైట్ ప్యానెల్ అంపైర్లు ఐపీఎల్ లో జరిగే అన్ని మ్యాచ్లలో బాధ్యతలు నిర్వర్తిస్తే దాదాపుగా 40 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

"""/" / ఇక రెండో గ్రేట్ అంపైర్లుగా చెప్పుకునే అనుభవం లేని కొత్త వారికి కూడా వేతనం బాగానే ఉంటుంది.

గత సీజన్లో డెవలప్మెంట్ అంపైర్లకు రూ.40,000 వేతనం ఇచ్చేవారు.

ఈ సీజన్లో రూ.19,000 పెరిగి రూ.

59,000 రూపాయలు ప్రాథమిక వేతనంగా ఇవ్వనున్నారు.వీరికి ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లో అవకాశం ఉండదు.

కాబట్టి వీరికి అదనంగా రోజువారి జీతభత్యాలు( Salaries ) ఇవ్వరుడెవలప్మెంట్ అంపైర్లు తమ దృష్టి వేతనాలపై కాకుండా ఎలైట్ ప్యానెల్ అంపైర్ల దగ్గర శిక్షణ తీసుకొని తమ నైపుణ్యాలను, మెరుగుపరచుకొని భవిష్యత్తులో ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి లోని..ఈ విషయాలు ప్రతి మహిళలోనూ ఉండాల్సిందే..!