శ‌రీరానికి `సెలీనియం` ఎంత అవ‌స‌ర‌మో తెలుసా?

శ‌రీరానికి కావాల్సిన ముఖ్య‌మైన పోష‌కాల లో సెలీనియం ఒక‌టి.అయితే మినరల్స్ జాబితాకు చెందిన‌ ఈ సెలీనియం గురించి చాలా మందికి అవ‌గాహ‌నే లేదు.

అస‌లు సెలీనియం శ‌రీరానికి ఎందుకు అవ‌స‌రం.? శ‌రీరంలో సెలీనియం చేసే ప‌నేంటి.

? సెలీనియం ఏ ఏ ఆహారాల్లో పుష్క‌లంగా ఉంటుంది.? వంటి విష‌యా‌లు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ హార్మోన్లు స‌రిగ్గా ప‌ని చేయాలంటే సెలీనియం ఎంతో అవ‌స‌రమ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శ‌రీరానికి స‌రి ప‌డా సెలీనియం అందిన‌ప్పుడే థైరాయిడ్ హార్మోన్లు స‌క్రమంగా ప‌ని చేస్తాయి.

త‌ద్వారా మెటబాలిజం రేటు మెరుగు ప‌డి శ‌రీర బ‌రువు కంట్రోల్ త‌ప్ప‌కుండా ఉంటుంది.

ఫ్రీ ర్యాడికల్స్‌ సంఖ్య పెరిగే కొద్ది శరీరంలో కణాలు దెబ్బ తింటాయి.అంతే కాదు.

గుండె జబ్బులు, డయాబెటిస్ మ‌రియు ఇత‌రిత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తాయి.అయితే శ‌రీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను వేగంగా అంతం చేసేందుకు సెలీనియం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

"""/" / అలాగే సెలీనియంకు ప్రాణాంత‌క‌ర వ్యాధుల్లో ఒక‌టైన క్యాన్స‌ర్‌ను అడ్డుకునే సామ‌ర్థ్యం కూడా ఉంది.

అవును, సెలీన‌యం బాడీలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.

అదే స‌మ‌యంలో శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేసి అనేక జ‌బ్బుల‌ను ద‌రి చేర‌కుండా ర‌క్ష‌ణ‌ను కూడా క‌ల్పిస్తుంది.

అందుకే సెలీనియంను శ‌రీరానికి రోజూ అందించాలి. """/" / ఇక సెలీనియం ఏ ఏ ఆహారాల్లో ఉంటుందంటే.

ఓట్స్, బాదంపప్పు, చికెన్‌, రొయ్యలు, బ్రెజిల్‌ నట్స్‌, మ‌ట‌న్‌, పనీర్‌, బ్రౌన్‌ రైస్‌, కోడి గుడ్లు, పుట్ట గొడుగులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలు, బీన్స్‌, పాలు, పెరుగు, వెల్లుల్లి వంటి ఆహారాల్లో సెలీనియం పుష్క‌లంగా ఉంటుంది.

కాబ‌ట్టి ఈ ఆహారాల‌ను ఆహారంతో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 20, శనివారం 2024