మీ ఇంట్లో ఎంత వరకు క్యాష్ నిలువ ఉండొచ్చో తెలుసా? అంతకుమించి దాటిందంటే?

మనలో కొంతమంది తమ ఇళ్లల్లో ఇబ్బుడిముబ్బడిగా డబ్బుని పోగేసుకుంటారు.ఒక డబ్బు( Money ) మాత్రమే కాదు, బంగారం, వెండి వంటి ఆభరణాలను కూడా దండిగా పోగేస్తూ వుంటారు.

అయితే కాలం కలిసొస్తే ఏం పర్వాలేదు గానీ, కాలం కళ్లెర్రజేస్తేనే కథ అడ్డం తిరుగుతుంది.

ఇక విషయంలోకి వెళితే, చాలామంది ఇప్పటికీ భారీగా క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.

ఎమర్జెన్సీకి అవసరం ఉంటుందని ఇంట్లో కొంత నగదు ఎప్పుడూ దాచుకుంటారు.ఒక్కోసారి ఆ ఆదాయం పరిమితులు దాటి ఉంటుంది.

అయితే ఆదాయపు పన్ను చట్టం( Income Tax Act ) ప్రకారం ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు అనే విషయం పైన ఇలాంటివారికి ఒక అవగాహన అనేది ఉండదు.

"""/" / ఇలాంటివారు ఇపుడు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇంట్లో నగదు దాచుకోవడానికి లిమిట్ అంటూ ఏమీ లేదు.

ఎంతైనా దాచుకోవచ్చు.కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్( Income Tax Raid ) జరిగితే మాత్రం సదరు వ్యక్తి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

అంతేకాదు ఇంట్లో ఉన్న నగదు, ఇంట్లో వ్యక్తుల ఆదాయానికి తగినట్టుగా ఉండాలి.వేలల్లో జీతం తీసుకున్న వ్యక్తి ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉంటే దెబ్బ పడుతుంది.

ఒకవేళ భారీగా నగదు ఉన్నట్టైతే ఆ నగదుకు లెక్కలు చెప్పాలి.ఇంట్లో ఉన్న నగదుకు, చెప్పిన లెక్కలకు తేడా ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి చర్యలు తప్పవు.

"""/" / అలాంటి సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ ఇంట్లో వున్న నగదు మొత్తాన్ని సీజ్ చేస్తారు.

అంతేకాకుండా నగదు లావాదేవీలకు సంబంధించి మరిన్ని నియమనిబంధనలు అనేవి ఉన్నాయి.ఏదైనా రుణం లేదా డిపాజిట్ కోసం రూ.

20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరించడానికి ఏ వ్యక్తికి అనుమతి లేదు.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిపితే, అందుకు తగ్గ లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ ప్రకారం, ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ నెంబర్ అనేది అవసరం.

కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదం..: బండి సంజయ్