మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా.. చెక్ చేసి బ్లాక్ చేసేయండి..!

భారతదేశంలో మనిషికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక్క ఆధార్ కార్డు ( Aadhaar Card )మాత్రమే.

బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డ్ కొనాలన్న, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, రేషన్ కార్డు పొందాలన్నా, ఏదైనా ప్రభుత్వ పథకం పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి ప్రూఫ్ కూడా ఆధార్ కార్డ్ అని అందరికీ తెలిసిందే.

ఒక్క ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు.ఆధార్ నెంబర్ తో ఎవరైనా దొంగతనంగా సిమ్ కార్డ్ తీసుకొని ఉపయోగిస్తే ఎలా తెలుసుకోవాలి.

ఆ సిమ్ కార్డ్ ( SIM Card )ఎలా బ్లాక్ చేయాలి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం తప్పనిసరి.

"""/" / టెలికాం డిపార్ట్మెంట్( Department Of Telecom ) నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డు నెంబర్ పై మొత్తం తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.

ఈ ఆధార్ కార్డులు ఒకే ఆపరేటర్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు.కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ తో వివిధ రకాల కంపెనీల సిమ్ కార్డులు తీసుకోవచ్చు.

ఇంతవరకు బాగానే ఉంది.మన ఆధార్ కార్డు పై ఒకటి లేదా రెండు సిమ్ కార్డులను తీసుకొని మనం ఉపయోగిస్తూ ఉంటాం.

ఎవరైనా మన ఆధార్ కార్డు నెంబర్ తో కొత్త సిమ్ తీసుకొని దుర్వినియోగం చేయడం, అవాంఛనీయ చర్యలకు పాల్పడడం లాంటి వాటికి అవకాశం ఉంది.

అప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం ఓ చక్కటి పరిష్కారాన్ని చూపింది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ Tafcop.

Dgtelecom.gov!--in అనే పోర్టల్ ప్రారంభించింది.

ఇందులో లాగిన్ అయితే ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూసేయొచ్చు.

అనధికార సిమ్ ని బ్లాక్ చేయవచ్చు. """/" / ముందుగా Https://tafcop.

Dgtelecom.gov!--in / లో లాగిన్ అవ్వాలి.

తరువాత అక్కడ కనిపిస్తున్న కాలమ్ లో ఆధార్ తో లింక్ అయివున్న మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.ఓటీపీ ఎంటర్ చేసి యాక్షన్ బటన్ పై క్లిక్ చేయాలి.

వెంటనే స్క్రీన్ పై మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో లింక్ చేయబడి ఉన్న మొబైల్ నెంబర్లు అన్ని ప్రత్యక్షమవుతాయి.

ఏదైనా నెంబర్ ను బ్లాక్ చేయాలనుకుంటే ఆ నెంబర్ పై క్లిక్ చేస్తే ఆప్షన్లు కనిపిస్తాయి.

వెంటనే నెంబర్ బ్లాక్ చేసెయ్యొచ్చు.