గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ పాత్రను వద్దనుకున్న హీరోలు ఎవరో తెలుసా ?

గాడ్ ఫాదర్.ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

అక్టోబర్ 9న దసరా కానుక గా ప్రేక్షకులను అలరించడానికి విడుదల చేసిన ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా వచ్చింది.

ఈ సినిమాని రీమేక్ సినిమా గా విడుదల చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా ఎన్నో మార్పులను, చేర్పులను జోడించి కమర్షియల్ హంగులు అద్ది మరి తెలుగులో విడుదల చేశారు.

అందుకే ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ మన సొంత నేటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది.

తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న మోహన్ రాజా ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించాడు.

మోహన్ రాజా హనుమాన్ జంక్షన్ సినిమాతో తొలిసారి దర్శకుడిగా తెలుగు తెరపైనే పరిచయం కాగా ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి తరలిపోయాడు.

లూసిఫర్ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం చిరంజీవికి బాగా నప్పుతోందని భావించి రామ్ చరణ్ తో ఈ విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ చెప్పిన విషయాన్ని చిరంజీవితో చెప్పి ఈ సినిమా చూడాలని ఒప్పించాడు.

చిరంజీవి సైతం సినిమా చూసి ఎంతగానో ప్రభావానికి గురయ్యాడు.దాంతో మోహన్ రాజాని తమిళం నుంచి తెప్పించి మరి ఈ సినిమాలో నటించారు చిరంజీవి.

"""/"/ ఇక గాడ్ ఫాదర్ తెలుగులో విడుదల అయ్యి సంచలనాలు సృష్టిస్తోంది.థియేటర్లలో ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు మిగతా పాత్రలు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

అందులో ముఖ్యంగా సత్య దేవ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు.సత్యదేవ్ పాత్ర ఈ చిత్రంలో చక్కగా పండింది.

అయితే సత్యదేవ్ పాత్రని అంతకుముందు కొంతమంది హీరోలు రిజెక్ట్ చేశారట. """/"/ మొదట అరవింద్ స్వామిని ఈ పాత్రలో నటించడానికి సంప్రదించగా ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు ఆయన ఒప్పుకోలేదు.

ఆ తర్వాత హీరో గోపీచంద్తో సైతం ఈ పాత్ర లో నటించాలని కోరారట.

అయితే పాత్ర నడిచిన తీరు బలంగా లేదనే ఒకే ఒక కారణంతో గోపీచంద్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.

ఇక వారికి చిత్ర యూనిట్ కి ఉన్న చివరి ఆప్షన్స్ సత్యదేవ్.ఆయనకి కథ చెప్పగానే ఒప్పుకోవడంతో ఈ సినిమాలో నటించి తన ఖాతాలో హిట్టును వేసుకున్నారు సత్య దేవ్.

మహేష్ బాబు, రవితేజలతో సినిమాలు.. శ్రీనువైట్ల రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!