ఒక్క బిర్యానీతో ఎన్ని పోషకాలో తెలుసా?

బిర్యానీ ఈ పేరు వినగానే ఆటోమేటిక్ గా మన నోట్లో నీళ్లు ఊరుతాయి.

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.సండే వచ్చిందంటే చాలు ఇక బిర్యాని తయారు చేయడానికి సిద్ధమైపోతుంటారు.

సాధారణంగా బిర్యానీ అనే పదం పెర్షియన్ పదం "బిరియన్"నుంచి ఉద్భవించింది.బిర్యానీ అనేది వేయించిన లేదా కాల్చిన అనే అర్థాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నాయి.బిర్యానీ అనేది దిగులుగా ఉన్న వ్యక్తి మానసిక లక్షణాలను తొందరగా ఉత్తేజ పరచడానికి దోహదపడుతుంది.

భారతదేశంలో అనేక రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రుచిని కలిగి ఉండి ఆ ప్రాంత సంస్కృతిని తెలియజేస్తుంటాయి.

అయితే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న బిర్యానీలు హైదరాబాద్ బిర్యాని, కాశ్మీరీ బిర్యానీ, లక్నవి బిర్యాని, అవధి బిర్యాని, కలకత్తా బిర్యాని అనేవి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి.

చికెన్ బిర్యానీ లో వాడే బియ్యం మసాలాదినుసులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి.

ఆ ప్రాంత మసాలా దినుసులను వాడుతూ తమ ప్రాంత ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నాయి.దీని కారణంగా ఆయా ప్రాంతాల బిర్యానీలకు ఆ పేర్లు వచ్చాయి.

బిర్యాని తింటే వాటిలోని కేలరీల శాతం అధికంగా అందులో ఉండే చికెన్ పై ఆధారపడి ఉంటుంది.

వివిధ రకాల ప్రాంతాల వారు ఆ ప్రాంతాల సంస్కృతులు, రుచుల కలయిక ద్వారా ఒక మంచి రెసిపీ గా పేరుగాంచింది.

అయితే ఎప్పుడు చికెన్ ,మటన్ బిర్యానీ నే కాకుండా కొన్నిసార్లు రొయ్యల బిర్యాని కూడా తినటం ద్వారా ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి.

మసాలా మెరినేటెడ్ చికెన్లో,రుచికరమైన కుంకుమ బియ్యం కలిగిన 200 గ్రాముల బిర్యానీలో సగటున 290 కేలరీలు పోషకాలు ఉంటాయి.

సాధారణంగా ఒక వ్యక్తి అల్పాహారంలో దాదాపుగా 300 క్యాలరీల ను తినాలి.మనం బిర్యానీ తయారు చేసే సమయంలో అందులో ఎన్నో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాము.

ఇందులో వాడే పసుపు, అల్లం, మిరియాలు, వెల్లుల్లి పుదీనా, మార్వాడి మెంతి ఆకులు మొదలైనవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కనుక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

అంతేకాకుండా బిర్యానీలో ముఖ్యంగా వాడే అంశం మాంసం.ఇందులో ప్రోటీన్లు అధిక శాతంలో ఉండటం వల్ల మన శరీరానికి విలువైన పోషకాలను ఈ బిర్యాని చేకూరుస్తుంది.

ఈ సుగంధ ద్రవ్యాలలో శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

కొద్దిగా ఎక్కువ పరిమాణంలో బిర్యాని తీసుకున్నట్లయితే అందుకు తగిన వ్యాయామం చేస్తే సరిపోతుంది.

చూశారు కదా బిర్యానీ తినడం ద్వారా ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి.

వైరల్ వీడియో: స్కాం కాలర్ కి వణుకు పుట్టించిన యువకుడు..