నల్లజీలకర్రలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలుసా..?!

జీలకర్రని పురాతనకాలం నుండి మనం వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటున్నాము కదా.

సుగంధ ద్రవ్యాల్లో జీలకర్రకి పెట్టింది పేరు.ఈ జీలకర్ర మనకి రెండు రకాలుగా లభ్యం అవుతుంది.

ఒకటి మనం రోజూ వంటల్లో ఉపయోగించే మాములు తెల్ల జీలకర్ర.అలాగే రెండోది నల్ల జీలకర్ర.

దీనిని మనం షాజీరా అని కూడా అంటారు.నల్ల జీలకర్ర పొడి రుచి చాలా బాగుంటుంది.

ఈ నల్లజీలకర్ర అనేక ఔషధ గుణాలను కలిగి ఉండడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

మరి అవేమిటో ఒకసారి చూద్దాం.నల్లజీలకర్రలో విటమిన్-బి1, బి2, బి3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్ మొదలైన ఎన్నో రకాల పోషకాలు నిండుగా ఉన్నాయి.

అలాగే ఈ నల్లజీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సప్లమెటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

"""/"/ అంతేకాకుండా ఈ షాజీరాను ప్రతి రోజు మనం తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

రోజూ నల్లజీలకర్రను తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి మధుమేహం అదుపులో ఉంటుంది.

అలాగే ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్ళు కొంచం తేనె, నల్ల జీలకర్ర విత్తనాల పొడి మరియు వెల్లుల్లిని మెత్తగా చేసుకుని పాలలో కలుపుకుని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి కొంతమందికి రక్త ప్రసారణ అనేది సరిగా లేనప్పుడు కండరాల పనితీరు సరిగా ఉండదు.

అలాంటప్పుడు తిమ్మిర్లు రావడం, అవయవాలు మొద్దుబారినట్టు అనిపించిన భావన వచ్చినప్పుడు నల్లజీలకర్ర తినడం వలన రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.

కడుపులో పేరుకుపోయిన హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి మన జీర్ణాశయాన్ని కాపాడుతుంది.అలాగే నల్ల జీలకర్ర వాడడం వలన దుష్ప్రభావాలు అనేవి ఏమి ఉండవు కానీ.

అతిగా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆయర్వేద నిపుణులు చెబుతున్నారు.

బాలీవుడ్ ను రెండు రకాలుగా దెబ్బ తీస్తున్న టాలీవుడ్ హీరోలు…