శాకుంతలం సినిమాలో సమంత ఎన్ని కిలోల బంగారం ధరించిందో తెలుసా… అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం( Shakunthalam ).ఈ సినిమాలో సమంత( Samantha ) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్( Gunasekhar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో నటీనటులు నటించిన నగల గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సినిమాలో నటీనటులు ధరించిన నగలు అన్నీ కూడా నిజమైనవని ఈయన తెలియచేశారు.

"""/" / సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన నిజమైన బంగారు కిరీటాన్ని ధరించారు దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో శకుంతల దుష్యంతుని పాత్రలలో నటించిన సమంత, దేవ్ మోహన్లకు కూడా నిజమైన బంగారు వజ్రా భరణాలను తయారు చేయించామని తెలియజేశారు.

ఈ నగలను హైదరాబాద్లోని వసుంధర జ్యువెలర్స్( Vasundara Jewellery ) సారధ్యంలో ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారధ్యంలో సుమారు 7 నెలల పాటు కష్టపడి డిజైన్ చేయించారని తెలిపారు.

ఇక ఈ సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నగలను వసుంధర జ్యువెలర్స్ లో ఆవిష్కరించినట్లు ఈయన తెలియజేశారు.

"""/" / ఇక ఈ సినిమాలో సమంత మొత్తం 14 రకాల ఆభరణాలను ధరించిందని ఈ నగలని సుమారు 15 కిలోల బరువు ఉంటాయని ఈయన తెలియజేశారు.

ఇక దుష్యంతుడి మహారాజు పాత్రలో నటించిన దేవ్ మోహన్ కూడా సుమారు 8 నుంచి 10 కిలోల బంగారు ఆభరణాలను ధరించినట్లు గుణశేఖర్ వెల్లడించారు.

ఇలా శకుంతల దుష్యంతుల బంగారు వజ్రాభరణాల కోసం సుమారు 14 కోట్ల వరకు ఖర్చు చేశామని ఈ సందర్భంగా గుణశేఖర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: నడిరోడ్డు మీద బైక్‌ పై అమ్మాయిలు, అబ్బాయిలు అసభ్యకర చర్యలు.. దాంతో పోలీసులు..?!