ఆరోగ్యానికి వరమైన కరివేపాకుతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?

గ్రామాల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో కరివేపాకు ( Curry Leaves )చెట్టు ఉంటుంది.

రోజువారీ వంటల్లో కరివేపాకును విరివిరిగా వాడుతుంటారు.ఆహారం రుచి మరియు ఫ్లేవర్ ను పెంచడంలో కరివేపాకుకు మరొకటి సాటి లేదు.

అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి కరివేపాకు వరమని నిపుణులు చెబుతుంటారు.

ఇకపోతే కరివేపాకుతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.ప్రస్తుత వర్షాకాలం( Rainy Season )లో చాలా మంది కఫం మరియు దగ్గు సమస్యలతో సతమతం అవుతుంటారు.

అలాంటివారు ఒక టీ స్పూన్ కరివేపాకు పొడికి తేనె కలిపి రోజుకు ఒకసారి తీసుకోవాలి.

ఇలా చేస్తే కఫం కరిగిపోతుంది.దగ్గు సమస్య( Cough Problem ) పరార్‌ అవుతుంది.

కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. """/" / అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారు కరివేపాకును కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి.

ఎందుకంటే కరివేపాకులో ఐరన్ మరియు ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి.రోజు ఉదయం పది వరకు పచ్చి కరివేపాకు ఆకులను నమిలి తింటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడతారు.

దెబ్బతిన్న కాలేయాన్ని రిపేర్ చేయడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.గుప్పెడు కరివేపాకును ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి రోజు తీసుకుంటే కాలేయంలోని టాక్సిన్స్( Toxins ) తొలగిపోతాయి.

కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. """/" / కరివేపాకులో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది.

నిత్యం ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకును తింటే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

శరీరంలో కొవ్వు కరుగుతుంది.దాంతో వెయిట్ లాస్ అవుతారు.

విరేచనాలను తగ్గించడానికి కూడా కరివేపాకు సహాయపడుతుంది.ఒక గ్లాస్ మజ్జిగలో వ‌న్ టేబుల్ స్పూన్‌ కరివేపాకు పేస్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి.

ఇలా చేస్తే మోషన్స్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.శరీరానికి కొంచెం శక్తి లభిస్తుంది.

మట్కా కోసం ఇష్టంలేని పనులు కూడా చేశాను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!