జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

భూమి మీద ఉండే చెట్లు మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాయి.

అయితే అందులో కొన్ని రకాల చెట్లు మనం పూజలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం.

అలా మనం పూజించే చెట్లలో జమ్మి చెట్టు ( Jammi Chettu )కూడా ఒకటి.

శ్రీరాముడు( Lord Rama ) రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లి విజయం సాధించారని అంటారు.

కాబట్టి విజయదశమి రోజు ఈ చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు.అంతేకాకుండా అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద ఉంచి,తాము వచ్చేవరకు ఆయుధాలను కాపాడమని ఆ చెట్టుకు మొక్కి వెళతారు.

"""/" / ఇక అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయదశమి రోజున చెట్టు మీద నుండి ఆయుధాలను తీసుకొని కౌరవుల పై యుద్ధం చేసి పాండవులు( Pandavas ) విజయం సాధిస్తారు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు మనం పూజలు చేస్తూనే ఉన్నాం.

జమ్మి చెట్టుకు పూజలు చేయడం వలన పనుల్లో విజయం చేకూరుతుంది.అయితే జమ్మి చెట్టుతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ( Health Benefits )కూడా ఉన్నాయి.

ఆయుర్వేదంలో జమ్మి చెట్టును అనారోగ్య సమస్యలను తగ్గించే ఒక ఔషధంగా ఉపయోగిస్తారు.ఈ చెట్టు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

ఈ చెట్టు గాలిని పీల్చడం వలన ఎన్నో రోగాలు నయం అవుతాయి. """/" / అలాగే ఈ జమ్మి ఆకుల పసరును లేపనంగా రాయడం వలన కుష్టు వ్యాధి( Leprosy ) కూడా నయం అవుతుంది.

జమ్మి ఆకులను, జమ్మి చెట్టు బెరడును, మిరియాలను కలిపి మెత్తగా నూరి మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి.

ఇక ఈ మాత్రలను మజ్జిగతో కలిపి తీసుకోవడం వలన అతిసారం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

అంతేకాకుండా అవాంచిత రోమాలు కూడా తొలగిపోతాయి.అలాగే జమ్మి ఆకులను కాల్చగా వచ్చిన పొగను పిలిస్తే కళ్ళ సమస్యలు( Eye Problems ) తగ్గిపోతాయి.

ఈ చెట్టు బెరడును నూరగా వచ్చిన గంధాన్ని విష కీటకాలు కుట్టిన చోట రాయడం వలన విష ప్రభావం కూడా తగ్గుతుంది.

బలగం వేణుకి హీరో దొరికాడా..? నాని హ్యాండ్ ఇచ్చిన కూడా ఆ కుర్ర హీరోను సెట్ చేశాడా..?