వేస‌విలో బ్రేక్‌ఫాస్ట్ గా పెరుగ‌న్నం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ల‌భాలో తెలుసా?

వేస‌వి కాలం( Summer ) ప్రారంభం కావ‌డంతో ఎండ‌లు మండిపోతున్నాయి.ఈ సీజ‌న్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క‌చ్చితంగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా ఆహారంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి.వేస‌విలో ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్( Breakfast ) గా ఇడ్లీ, వ‌డ‌, దోస‌, పూరీ, పొంగ‌ల్ లాంటివి కాకుండా పెరుగ‌న్నం( Curd Rice ) తిన‌డం ఆరోగ్యప‌రంగా ఎంతో ప్ర‌యోజ‌క‌రమ‌ని నిపుణులు అంటున్నారు.

శరీరాన్ని చల్లబరిచే సహజమైన ఆహారాల్లో పెరుగ‌న్నం ఒకటిగా పరిగణించబడుతుంది.వేస‌వి కాలంలో బాడీ హీట్ భారీగా పెరుగుతుంటుంది.

అయితే బ్రేక్ ఫాస్ట్‌లో పెరుగ‌న్నం తిన‌డం వ‌ల్ల వేడికి గురయ్యే శరీరాన్ని ఇది కూలింగ్ ఎఫెక్ట్‌తో సమతుల్యం చేస్తుంది.

శరీర ఉష్ణోగ్రత( Body Temperature ) నియంత్రితంగా ప‌ని చేస్తుంది.అలాగే స‌మ్మ‌ర్‌ సీజ‌న్ లో అధికంగా చెమట పట్టడం వల్ల ఒంట్లో నీరంత ఆవిరైపోతుంటుంది.

పెరుగన్నం తినడం వల్ల ద్రవ పదార్థాలు సమతుల్యం అవుతాయి.డీహైడ్రేషన్( Dehydration ) బారిన ప‌డ‌కుండా ఉంటారు.

నీరసం, అలసట ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. """/" / పెరుగులో ప్రొబయాటిక్స్ ఉండడం వల్ల పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

వేసవిలో కొంద‌రు త‌ర‌చూ ఎసిడిటీతో ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే పెరుగన్నం సహజంగా అల్కలైన్ గుణం కలిగి ఉండటం వ‌ల్ల అది యాసిడిటీని తగ్గిస్తుంది.

ఉదర సంబంధ సమస్యలు, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యల‌కు కూడా చెక్ పెడుతుంది.

"""/" / వేసవిలో చర్మం పొడి బారకుండా ఉంచడంలో పెరుగన్నం సహాయపడుతుంది.పెరుగులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు చర్మానికి మృదుత్వం అందిస్తాయి.

పెరుగ‌న్నం ఫుల్‌ఫిల్లింగ్ ఫుడ్‌గా పనిచేస్తుంది, బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని తినడం వల్ల ఎక్కువ కాలం ఆకలిని నివారించుకోవచ్చు.

పెరుగులో ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉండ‌టం వ‌ల్ల‌ ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్ప‌డ‌తాయి.

ర‌క్త‌పోటును సైతం నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.ఇక పెరుగ‌న్నం చేసుకోవ‌డం చాలా సుల‌భం.

నైట్ నిద్రించే ముందు రైస్ లో గోరు వెచ్చ‌గా ఉన్న‌ పాలు మ‌రియు హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేసి మూత పెడితే ఉద‌యానికి పెరుగ‌న్నం రెడీ అవుతుంది.

ఈ పెరుగ‌న్నంలో చిటికెడు ఉప్పు, కావాలి అనుకుంటే ప‌చ్చి ఉల్లిపాయ ముక్క‌లు వేసుకుని బ్రేక్‌ఫాస్ట్ గా తినేయ‌డ‌మే.