రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? గుడ్డులోని పచ్చ సొనతో వీరికి ప్రమాదం ఉంది..!
TeluguStop.com

గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్లు చెబుతూ ఉంటారు.ఇక చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో కూడా గుడ్లను తీసుకుంటూ ఉంటారు.


అలాగే ఫిట్నెస్ లో ఉన్న వారు ఫ్రూట్స్, ప్రోటీన్ పొందడానికి గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.


అయితే మొత్తానికి గుడ్లు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.గుడ్లను తినడం వలన కండరాల అభివృద్ధికి ఇది సహాయపడుతుంది.
అయితే చాలామందికి రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? గుడ్లు తినడం సురక్షితమేనా? అన్న ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు రెండు నుండి మూడు గుడ్లను కచ్చితంగా తీసుకోవాలి.
"""/" /
అయితే ఆరోగ్యంగా ఉన్నవారు వారంలో ఏడు నుంచి పది గుడ్లు తీసుకోవడం మంచిది.
ఇక అథ్లెట్లు లేదా వర్కౌట్ చేసే వాళ్ళకు ప్రోటీన్లు ఎక్కువ అవసరం ఉంటుంది.
అలాంటి వారు రోజుకు కచ్చితంగా నాలుగైదు గుడ్లు తినాలి.అయితే రోజు గుడ్లు తినేవారు గుడ్డులోని తెల్లభాగాన్ని మాత్రమే తినాలి.
అయితే గుండె జబ్బుల( Heart Disease )తో బాధపడేవారు రోజుకు రెండు గుడ్ల కంటే ఎక్కువ తినకూడదు.
ఎందుకంటే గుడ్డు మంచి కొలెస్ట్రాల్ను ప్రోత్సహిస్తుంది.కొలెస్ట్రాల్ సమస్య( Bad Cholesterol ) ఉన్నవారు గుడ్లు తీసుకోవడం తగ్గించాలి.
గుడ్డు తినడం వలన చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. """/" /
అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా గుడ్డు బలపరుస్తుంది.
తరచూ గుడ్డు తీసుకోవడం వలన కంటి చూపును పెరుగుతుంది.అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపరుస్తుంది.
ఇక గుడ్డు ఎముకలను కూడా బలపరుస్తుంది.కండరాల కణజాలాన్ని రిపేర్ చేస్తుంది.
ఇక అధిక రక్త పోటు( High Blood Pressure ) ఉన్నవారు గుడ్లను అస్సలు తినకూడదు.
అయితే ఒకవేళ తప్పక తీసుకోవాల్సి వస్తే మాత్రం పసుపు భాగాన్ని తీసి తినాలి.
దాని నుంచి హాని తక్కువగా ఉంటుంది.గుడ్డులోని పచ్చ సోనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?