చక్కెరకు బదులుగా దీన్ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?
TeluguStop.com

చాలామంది ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు.అయితే మనం తినే అన్ని ఆహారాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవు.


కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తాయి.అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎంతో రుచికరమైన పదార్థాలే మనపై చాలా చెడు ప్రభావం చూపిస్తాయి.


అలాంటి వాటిలో పంచదార కూడా ఒకటి.అందుకే పంచదారకు బదులుగా తీపిని అందించే పదార్థాలను తయారు చేసుకుంటాం.
అలాంటి వాటిలో స్టీవియా కూడా ఒకటి స్టీవియా అనేది చెట్టు ఆకుల నుండి తయారవుతుంది.
ఇది చక్కెరకు బదులుగా వాడవచ్చా? దీని వలన ఆరోగ్యానికి ఏమైనా హాని ఉంటుందా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
మనం తినే పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలలో సహజమైన షుగర్ ఉంటుంది.
అయితే ఇవి అంతగా హాని చేయవు.కానీ చక్కెరతో తయారైన పదార్థాలు, పానీయాలు మాత్రం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ముఖ్యంగా అధిక బరువు, మధుమేహం, రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పంచదారను వాడటం ఏమాత్రం మంచిది కాదు.
కాబట్టి చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడదగినది మనకు అందుబాటులోకి వస్తున్నాయి.అలాంటి వాటిలోనే స్టీవియా ఒకటి.
స్టీవియా( Stevia ) అనే చెట్టు ఆకుల నుండి తయారు అయ్యే కృత్రిమ పంచదార.
సాధారణ చక్కెర కంటే 300 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది.
కానీ ఇందులో పిండి పదార్థాలు, క్యాలరీలు, కృతిమమైన అంశాలు ఏమీ ఉండవు.అలాగే వీటిని పంచదార లాగే ఆహారాలలో వాడవచ్చు.
"""/" /
ఇక చక్కెరకు బదులుగా స్టీవియా తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పంచదార తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్( Sugar Levels ) పెరుగుతాయి.
కేవలం చక్కెర మాత్రమే కాకుండా తేనె, బెల్లం కూడా షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి.
కాబట్టి సహజ మొక్కలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.ఇందులో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్( Calories, Carbohydrates ) ఉండవు.
అందుకే షుగర్ ఉన్న వారు టీ, కాఫీలో తీసుకోవచ్చు.అలాగే వీటిని తీసుకోవడం వలన గ్లూకోస్ తగ్గి పెరగకుండా నియంత్రిస్తాయి.
కాబట్టి దీని మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవచ్చు.దీనివలన క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
కాబట్టి షుగర్ కు బదులుగా స్టీవియా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
శిల్పాలు చెక్కుతున్న రోబోలు.. శిల్పులకు కూడా గడ్డు కాలం ఎదురయ్యిందా..?