మల్చింగ్ విధానంలో పంటలను సాగు చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
TeluguStop.com
వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి.ఈ క్రమంలోనే ప్లాస్టిక్ మల్చింగ్( Plastic Mulching ) అనే ఒక కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చింది.
ఈ పద్ధతిని ఉపయోగించి సాగు చేస్తే కూలీల ఖర్చు తగ్గడంతో పాటు చాలావరకు శ్రమ కూడా తగ్గుతుంది.
దీంతో పెట్టుబడి భారం తగ్గి దిగుబడి పెరుగుతుంది.ప్లాస్టిక్ మల్చింగ్ విధానంలో పంటలను సాగు చేస్తే రైతులకు ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ మల్చింగ్ విధానంలో మొక్క చుట్టూ ఉండే నేల తేమ ఆవిరి కాకుండా ఉంటుంది.
దీంతో 30 నుంచి 60 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. """/" /
ముఖ్యంగా కలుపు సమస్యలు( Weed Problems ) చాలా వరకు తక్కువ.
సూర్యరశ్మి మొక్క చుట్టూ తగలదు కాబట్టి కలుపు మొక్కల సమస్య దాదాపుగా ఉండదు.
కలుపు సమస్య లేకపోతే వివిధ రకాల చీడపీడల తెగుళ్ల బెడద దాదాపుగా లేనట్టే.
మొక్క వేళ్ళ చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించే అవకాశం ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల ఏర్పడుతుంది.
భూమి లోపల ఇతర పంటలకు సంబంధించిన చీడపీడల అవశేషాలు, వివిధ రకాల తెగులను కలిగించే శిలీంద్రాలు ఏమైనా ఉంటే ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నాశనం అవుతాయి.
"""/" /
మల్చింగ్ విధానం వల్ల మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది.కాయ సైజు, నాణ్యత పెరిగి, మంచి రంగుతో అభివృద్ధి చెందుతుంది.
వ్యవసాయంలో పెట్టుబడుల భారం పెరగడం వల్ల ఈ ప్లాస్టిక్ మల్చింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది.
ఒకవైపు శ్రమ తగ్గడం, పెట్టుబడి తగ్గడం.మరొకవైపు నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.
సాధారణ పద్ధతుల వల్ల విస్తు పోయిన రైతులు ఈ మల్చింగ్ విధానం వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?