త్రిఫల చూర్ణం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? దాన్ని ఎలా తీసుకోవాలంటే?

చాలామంది అజీర్తి సమస్యలు, రాత్రి నిద్ర లేకపోవడం, జుట్టు రాలిపోవడం, మొహం మీద ఎప్పుడు మొటిమలు రావడం, క్యాబెటీస్, అధిక బరువు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అయితే వీటన్నిటికీ దివ్య ఔషధం ఆయుర్వేదంలోని త్రిఫల చూర్ణం అని చెప్పాలి.దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ఇది ఒక గొప్ప మూలికల పదార్థం.ఈ త్రిఫల చూర్ణం జీర్ణకోశ సమస్యల దగ్గర నుంచి దంతాలు పుచ్చిపోకుండా కాపాడే వరకు అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.

అదేవిధంగా వ్యాధులను తగ్గించి దీర్ఘాయువు పెంచుతుంది.అందుకే ఆయుర్వేద నిపుణులు దీన్ని తీసుకోవచ్చని సూచిస్తూ ఉంటారు.

అసలు త్రిఫల అంటే ఏమిటంటే అమలకి, విభితకి, హరితకి, అనే మూడు ఆయుర్వేద మూలికల పొడి.

ఈ త్రిఫల చూర్ణం ప్రకారం వాటా, పితా, కఫా దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది.

అదే విధంగా అనారోగ్యాలు లేకుండా చురుకైన జీవితాన్ని గడిపేందుకు ఇది సహాయపడుతుంది.అమలకి అంటే ఉసిరి.

ఇది కాలేయ పనితీరును నియంత్రిస్తుంది. """/"/ ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

విబితకి, కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది.అలాగే ఇది పెద్ద పేగుని శుభ్రపరుస్తుంది.

అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థను కూడా కాపాడుతుంది.హరితకిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి.

ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి సహాయపడతాయి.అయితే త్రిఫల చూర్ణాన్ని ఎలా తీసుకోవాలంటే త్రిఫల పొడి క్యాప్సిల్స్ ద్రవ రూపంలో ఉంటుంది.

మౌత్ వాష్, చర్మ సంరక్షణ లేదా జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించాలని అనుకున్న వాళ్లు దాన్ని పొడి రూపంలో తీసుకోవడం మంచిది.

""img Src=" "https://telugustop!--com/wp-content/uploads/2023/01/Triphala-Churna-Antioxidants-liver-health-health-tips!--jpg/ ఒకవేళ దీని రుచి నచ్చకపోతే క్యాప్సూల్స్ తీసుకోవచ్చు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పేగుల్లోని వ్యర్ధాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

అదేవిధంగా జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

అదేవిధంగా ఇది కంటిచూపుకు కూడా చాలా మేలు.కంటి శుక్లాం, దృష్టిలోపం, గ్లోకోమా లాంటి వ్యాధులను ఇది నివారిస్తుంది.

అదేవిధంగా శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.