పంచదారను పక్కన పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

రోజువారీ ఆహారపు అలవాట్లలో పంచ‌దార లేదా చక్కెర( Sugar ) ఒక భాగం అయిపోయింది.

టీ నుంచి డెజర్ట్‌ల వరకు అన్నింటిలోనూ పంచ‌దార ప‌డాల్సిందే.పంచ‌దార‌ ఆరోగ్యానికి మంచిది కాద‌ని తెలిసిన కూడా దాన్ని వాడ‌టం మాత్రం ఆప‌రు.

కానీ పంచ‌దార‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టడం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

అధిక చక్కెర వినియోగం టైప్ 2 డయాబెటిస్‌కు( Type-2 Diabetes ) ప్రధాన ప్రమాద కారకం అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

చ‌క్కెరను వాడ‌టం మానేస్తే మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.అలాగే పంచ‌దారను అవాయిడ్ చేయ‌డం వ‌ల్ల‌ మానసిక స్థిరత్వం మరియు మానసిక స్పష్టత మెరుగుప‌డుతుంది.

అధిక బ‌రువుతో( Over Weight ) బాధ‌ప‌డుతున్న వారు, వెయిట్ లాస్ అవ్వాల‌ని భావిస్తున్న‌వారు క‌చ్చితంగా పంచ‌దార‌ను ప‌క్క‌న పెట్టేయండి.

ఇది బరువు తగ్గడానికి మరియు పొట్ట కొవ్వును తగ్గించుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. """/" / శుద్ధి చేసిన చక్కెరను వాడ‌టం మానేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కొవ్వు కాలేయ వ్యాధికి దూరంగా ఉండొచ్చ‌ని అంటున్నారు.పంచ‌దార చ‌ర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది.

పంచ‌దార‌ను ప‌క్క‌న పెట్టేస్తే మొటిమ‌ల బెడ‌ద ఉండ‌దు.అదే స‌మ‌యంలో చ‌ర్మం కాంతివంతంగా తయారవుతుంది.

"""/" / చక్కెర ఆహారాలు మరియు పానీయాలు జీర్ణ ఆరోగ్యానికి అంతరాయం కలిగిస్తాయి.

ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తాయి.అదే చ‌క్కెర‌ను అవాయిడ్ చేస్తే జీర్ణక్రియ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

ఆయా జీర్ణ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.అయితే పండ్లు, కొన్ని పాల ఉత్పత్తులు మరియు కొన్ని కూరగాయలలో లభించే సహజ చక్కెరలు పైన పేర్కొన్న ఆరోగ్య ప్రమాదాలతో సంబంధం కలిగి ఉండవు.

అవి ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి ఇతర పోషకాలతో ప్యాక్ చేయబడతాయి.

అందువ‌ల్ల స‌హ‌జ చ‌క్కెర‌ల‌ను ఎటువంటి ఆందోళ‌న లేకుండా తీసుకోవ‌చ్చు.

నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?