గర్భిణీల్లో ఒత్తిడి శిశువులకు ఎంత ప్రమాదకరమో తెలుసా?

పెళ్లి తర్వాత ప్రతి మహిళ మాతృత్వాన్ని కోరుకుంటుంది.అమ్మ అన్న పిలుపు కోసం ఎంతగానో తహతహలాడుతుంటుంది.

కోరుకున్నట్టుగానే ప్రెగ్నెన్సీ( Pregnancy ) కన్ఫామ్ అయితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.

ప్రెగ్నెన్సీ తర్వాత ఒక స్త్రీ తన శరీరంలో అనేక మార్పులను ఎదుర్కొంటుంది.అది ఆమె మొత్తం మానసిక స్థితి మరియు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ముఖ్యంగా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది గర్భిణీలు లేనిపోని ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతుంటారు.

కానీ గర్భిణీల్లో ఒత్తిడి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. """/" / అధిక ఒత్తిడి ( High Pressure )తల్లితో పాటు పుట్ట పోయే శిశువుకు సైతం చాలా ప్రమాదకరమని అంటున్నారు.

ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు ఒత్తిడిని పెంచుకుంటే కడుపులో శిశువు యొక్క ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయి.

అలాగే నెలలో నిండకుండానే డెలివరీ అవ్వడం, తక్కువ బరువుతో శిశువు పుట్ట‌డం వంటివి ఎక్కువగా జరుగుతాయి.

ఒక్కోసారి మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.అందుకే గర్భిణీలు ఒత్తిడికి దూరంగా ఉండాలని నిపుణులు బలంగా చెబుతున్నారు.

అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు కంటి నిండా నిద్ర( Sleep ) ఉండేలా చూసుకోవాలి.

మంచి విశ్రాంతిని మనసును, మెదడును ప్రశాంతంగా మారుస్తుంది.ఒత్తిడి దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించకండి.నలుగురితో కలిసిపోండి.

సరదాగా మాట్లాడుతూ సంతోషంగా ఉండండి.త‌ల్లి ఆనందంగా నవ్వుతూ ఉంటే కడుపులో శిశువు కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

"""/" / రోజూ కాసేపు ధ్యానం ( Meditation )వంటిది చేయండి.ఇది మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తాయి.అలాగే నట్స్, అవకాడో, ఆరెంజ్, ఆకుకూరలు, పెరుగు, గ్రీన్ టీ, గుమ్మడి గింజలు, గుడ్డు, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి ఆహారాలను ప్రెగ్నెన్సీ సమయంలో తప్పకుండా తీసుకోండి.

ఎందుకంటే ఈ ఆహారాలు ఆరోగ్యానికి( Health ) మేలు చేయడమే కాదు ఒత్తిడి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

మరియు కడుపులోని శిశువు ఎదుగుదలకు సైతం సహాయపడతాయి.

న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఎన్టీఆర్, చరణ్ బ్యూటీ.. ఈ హీరోయిన్ దశ తిరిగిపోతుందిగా!