ఫ్రిడ్జ్ లో గుడ్లను నిల్వ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా…?
TeluguStop.com
ప్రస్తుతకాలంలో పోషక విలువలు కలిగిన గుడ్లు తినడం అందరి ఇళ్ళల్లో సర్వసాధారణమైపోయింది.ఇదివరకు కొంతమంది గుడ్లను కూడా తినకుండా పూర్తి శాకాహారులు ఉండేవారు.
అలాంటి వారు కూడా ఈ మధ్య కాలంలో గుడ్డు మాంసాహారి కాదని తేలడంతో వాటిని తీసుకోవడం మొదలుపెట్టారు.
అయితే ఇప్పటి కాలంలో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉండడం సర్వసాధారణం.బయటకు వెళ్లి వారానికో, పది రోజులకో సరిపడు కూరగాయలను ఒకేసారి తీసుకువచ్చి ఫ్రిజ్ లో పెట్టుకొని మనం కావలసినప్పుడు వాడుకుంటూ ఉంటాము.
ఇక మరికొందరైతే ఒకటేసారి గుడ్లు, అలాగే పాలు, పెరుగు లాంటివి కూడా ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు.
అయితే కొన్ని పదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ ఉండి వాటిని తీసుకోవడం ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.
అందులో ముఖ్యంగా కూరగాయలు లాగా ఫ్రిజ్ లో గుడ్లను పెట్టడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
నిజానికి గుడ్లను తీసుకువచ్చి ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని చాలా మంది భావిస్తారు.
నిజానికి అలా చేయడం ద్వారా గుడ్డు పై పెంకు పై సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని, అలా ఫ్రిజ్లో గుడ్లను పెట్టడం ద్వారా అవి తినే సమయానికి రుచి కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.
అంతేకాదు ఈ గుడ్లు తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని తెలుపుతున్నారు.
గుడ్లను కేవలం గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలని ఇలా కేవలం గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన గుడ్డును తినడం ద్వారా మాత్రమే మనం గుడ్డులోని పూర్తి రుచిని ఆస్వాదించవచ్చని తెలుపుతున్నారు.
అంతేకాదు ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్ ల కంటేరూమ్ టెంపరేచర్ లో నిల్వ చేసిన గుడ్డులో అధిక పోషకాలు లభిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇలా ఫ్రిడ్జ్ నిల్వ చేయడం ద్వారా ఏర్పడిన బ్యాక్టీరియా కారణంగా గుడ్డు కాస్త విషపూరితం అవుతుందని, అలా అయిన వాటిని తీసుకుంటే కొన్నిసార్లు వాంతి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామూలుగా టమాటా పండ్లను కూడా మనం ఫ్రిజ్ లో ఉంచుతాము.వాటిని తీసుకు వచ్చిన సమయం కంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చూస్తే అవి చాలా గట్టిగా తయారవుతాయి.
అలాంటి పండ్లను కూర చేసినా కూడా పెద్దగా రుచి అనిపించదు.కాబట్టి కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్ లో ఉంచకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచితే అందులోని పోషక పదార్థాలను మనం ఆస్వాదించగలము.
వైరల్: వరుడి పరువు ఇలా పోతుందని ఉహించి ఉండడు పాపం!