ఇంట్లో చిరంజీవి రామ్ చరణ్ ను ఎలా పిలుస్తాడో తెలుసా..?

తెలుగు లో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు చిరంజీవి( Chiranjeevi ).

ఇక తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు .ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాను చేస్తు మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన ' విశ్వంభర' ( Visvambara )అనే సినిమా చేస్తున్నాడు.

ఇక వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

అయితే ఇక చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మాత్రం మెగా పవర్ స్టార్ గా ఎదగడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా తన స్థానాన్ని విస్తరింప చేసుకున్నాడు.

"""/" / ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ని చిన్నప్పటి నుంచి చిరంజీవి ఒక నిక్ నేమ్ తో పిలుస్తూ ఉండేవాడట.

అది ఆ పేరు ఏంటంటే 'కన్నా '( Kanna ) అని పిలుస్తూ ఉండేవాడట.

ఇక ఇంట్లో రామ్ చరణ్ ఉన్నప్పుడు తనని అదే పేరుతో పిలవడం చిరంజీవికి అలవాటైందట.

ఒకవేళ బయట ఫంక్షన్ కి గాని, పబ్లిక్ గా వచ్చినప్పుడు గానీ చరణ్ అని పిలుస్తుంటారట.

కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా క్యూట్ గా కన్న అని పిలుస్తాడట.

చిరంజీవికి చరణ్ ఒక్కడే కొడుకు అవడం వల్ల ఆయన్ని చిన్నప్పటి నుంచి గారాబం గా పెంచడమే కాకుండా అతన్ని కన్న అని పిలవడం తనకు అలవాటైందని తన సన్నిహితులు చెబుతున్నారు.

"""/" / ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు.

ఇక మొత్తానికైతే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తన సత్తా చాటుతున్నాడు.

ఇక తొందర్లోనే గేమ్ చేంజర్ సినిమా తో మరోసారి తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నాడు.