బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా..!
TeluguStop.com
మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ( Bathukamma Festival )కు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని దాదాపు చాలా మందికి తెలుసు.
అలాగే బాద్రాపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు అంటే దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ప్రతి రోజూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను పెరుస్తూ ఊరువాడ ఏకమై పండుకొను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ పూల పండగ భాద్రపద అమావాస్యతో ప్రారంభిస్తారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతిపూలు, చామంతి ఇలా రకరకాల పులతో బతుకమ్మను పేరుస్తూ ఉంటారు.
మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. """/" /
మొదటి రోజున అమ్మకు తులసి ఆకులు( Basil Leaves ), వక్కలు సమర్పిస్తారు.
ఇంకా చెప్పాలంటే రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ( Atukula Batukamma ) అని అంటారు.
అలాగే చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు.
ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు.
అలాగే భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే బతుకమ్మ పండుగలో నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను చేస్తారు.
అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు.అలాగే ఐదవ రోజు అట్ల బతుకమ్మ( Atla Batukamma ) అని పిలుస్తారు.
ఈరోజు అట్లు తయారుచేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.ఏడవ రోజు వేపాకుల బతుకమ్మ అని అంటారు.
సకినాల పిండిని వేపకాయల్లా తయారుచేసి నూనెలో వేయిస్తారు.ఆ పదార్థాన్ని అమ్మ కు నైవేద్యంగా సమర్పిస్తారు.
8వ రోజున వెన్నెముద్దుల బతుకమ్మ అని అంటారు.నువ్వులు, వెన్న ముద్ద, బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.తొమ్మిది రోజుల్లో చాలా ముఖ్యమైన రోజు ఇదే.
"""/" /
ఆ రోజు సద్దుల బతుకమ్మ( Saddula Bathukamma )ను పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు.
పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ చివరి రోజు బతుకమ్మను పేర్చి ఆడి పాడుతారు.ఆ తర్వాత బతుకమ్మను తల మీద పెట్టుకొని ఊర్లో చెరువు వరకు ఊరేగింపు వెళ్తారు.
ఆ తరువాత బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.తర్వాత తెచ్చుకున్న ప్రసాదం అందరికీ పంచి పెడతారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!