అయ్యప్పకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. శబరి ఆలయ నిర్మాణం ఎప్పుడూ ఎలా జరిగిందో తెలుసా..
TeluguStop.com
శివుడు, మోహిని అయ్యప్పని పంబ నది ఒడ్డున వదిలేసి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి పందల రాజు రాజశేఖరుడు అటువైపు వెళుతూ తీరంలో ఈ బిడ్డను చూసి చూస్తాడు.
అయితే ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల ఆ బిడ్డను శివుడి అనుగ్రహం గా భావించి తన అంతఃపురానికి తీసుకొని వెళ్ళిపోతాడు.
రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను చూసి రాణీ కూడా ఎంతో సంతోషించింది.అయితే అయ్యప్ప వారి అంతఃపురానికి వచ్చిన వేళా విషయం విశేషం వారికి పండంటి మగ బిడ్డ కూడా జన్మిస్తాడు.
అలా ఈ దంపతులు ఇద్దరు మగ బిడ్డలను పెంచుకుంటూ ఉంటారు.ఈ అయ్యప్పకు ఈ పేరు ఎలా వచ్చిందంటే తనలో ఉన్న కొన్ని మంచి గుణాలను చూసి కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని పిలుస్తూ ఉండేవారు.
ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవడం మొదలుపెట్టారు.రాజశేఖరుడు తన ఇద్దరు బిడ్డలను గురుకులానికి పంపిస్తాడు.
కొంతకాలం తర్వాత విద్యను అభ్యాసించిన కొడుకులిద్దరూ రాజ్యానికి తిరిగి వస్తారు.ఇద్దరు కొడుకులలో పెద్దవాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు ప్రకటిస్తాడు.
అయితే ఇలా చేయడం రాణీ కు ఇష్టం ఉండదు.అయ్యప్ప దత్త పుత్రుడు కనుక అయ్యప్ప కి రాజ్యాన్ని ఇవ్వడం రాణి కి అసలు ఇష్టం ఉండదు.
దాంతో పట్టాభిషేకం ఎలాగైనా జరగకుండా ఆపాలని తనకు తలనొప్పి వచ్చినట్లు నాటకం ఆడి ఇక ఈ నొప్పి పోవడానికి పులి పాలు కావాలని వైద్యుల చేత చెప్పిస్తుంది.
"""/"/
దాంతో అయ్యప్ప తన తల్లికి కావాల్సిన పులిపాలను నేను తెస్తాను అని అడవికి బయలుదేరుతాడు.
అయితే రాజశేఖరుడు నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నా నీకు బదులుగా మరొకరిని పంపిద్దామని చెబుతాడు.
దానికి అయ్యప్ప తండ్రి నాకు రాజ కాంక్ష లేదు ఈ రాజ్యాన్ని సోదరునికి ఇవ్వండి అని నాకు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెబుతాడు.
ఆ దేవాలయాన్ని ఎక్కడ కడతారంటే నేను ఒక బానాన్ని ఇక్కడ నుండి సందిస్తాను.
ఇక ఆ బాణం ఎక్కడికైతే వెళ్లి పడుతుందో అక్కడ నా దేవాలయాన్ని నిర్మించమని కోరి వెళ్లిపోతాడు.
అలా ఆరోజు అయ్యప్ప వదిలిన బాణం శబరిమల కొండపై పడుతుంది.
యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..