తరచూ గొంతు డ్రై అవుతోందా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
TeluguStop.com

తడారిపోయి గొంతు డ్రైగా మారడం దీనిని దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఫేస్ చేసే ఉంటారు.


అప్పుడప్పుడు ఇలా జరిగితే పెద్ద ఇబ్బందేమి ఉండదు.కానీ, కొందరిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది.


వాటర్ ఎంత తాగినా మళ్లీ కొద్ది సేపటికి గొంతు పొడి పొడిగా మారిపోతుంది.
దాంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.అయితే గొంతు తరచూ డ్రై మారడం అనేది కొన్ని వ్యాధులకు సంకేతమని మీకు తెలుసా.
? అవును, కొన్ని వ్యాధులకు గురైనప్పుడు సైతం గొంతు తరచూ తడారిపోతుంది.మరి ఆలస్యం చేయకుండా ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు డ్రైగా మారడం అనేది మధుమేహం వ్యాధికి సంకేతంగా చెప్పవచ్చు.మధుమేహం బారన పడినప్పుడు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు.
దాంతో శరీరంలోని నీరంతా పోతుంది.అందు వల్లనే, గొంతు పొడిగా మారిపోతుంది.
అలాగే అధిక రక్త పోటు ఉన్నా సరే గొంతు తరచూ తడారిపోతుంది.అధిక రక్త పోటు వల్ల చెమటలు అధికంగా పడుతుంటాయి.
ఈ క్రమంలోనే శరీరం నుంచి నీరంతా స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది.ఈ కారణంగా గొంతు తొందరగా డ్రైగా మారి పోతుంటుంది.
"""/" /
పదే పదే అధిక ఒత్తిడికి గరవుతున్నా గొంతు పొడిగా ఎండి పోయినట్టు మారిపోతుంది.
అందుకే ఒత్తిడికి ఎంత దూరంగా ఉండే అంత మంచిది.డిహైడ్రేషన్ కూడా గొంతు తరచూ డ్రై అవ్వడానికి ఓ కారణం.
అందువల్ల, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. """/" /
కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నా గొంతు పొడిగా అయిపోతూ ఉంటుంది.
ఇక జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఏవైనా సమస్యలు ఉండటం వల్ల కూడా గొంతు డ్రైగా మారి పోతుంది.
కాబట్టి, మీ గొంత తరచూ తడారిపోయి డ్రైగా అవుతుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.