చరణ్ తండ్రి కాబోతున్న గుడ్ న్యూస్ ముందుగా ఎవరికి చెప్పారో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ప్రస్తుతం ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

మరోవైపు ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో ఈయన పెద్ద ఎత్తున అమెరికాలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

"""/"/ ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం లాస్ఏంజెల్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ రామ్ చరణ్ పలు విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తాను తండ్రి కాబోతున్నాను అనే విషయాన్ని అభిమానుల కంటే ముందుగా ఎవరితో షేర్ చేసుకున్నారో ఈ సందర్భంగా తెలియజేశారు.

గత కొన్ని నెలల క్రితం చిరంజీవి రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.

ఇలా అభిమానుల కన్నా ముందుగా ఈ శుభవార్తను రామ్ చరణ్ తన ప్రాణ స్నేహితుడు ఆత్మీయుడు ఎన్టీఆర్ తో పంచుకున్నానని తెలిపారు.

"""/"/ ఈ శుభవార్తను ప్రకటన చేయడానికి ముందు నా ఆనందాన్ని పంచుకోవడానికి నా స్నేహితులు ఎన్టీఆర్ కి ఫోన్ చేశానని చరణ్ తన సంతోషాన్ని తెలియజేశారు.

మేము మా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలలో ఎంతో సంతోషంగా ఉన్నాము.జీవితంలో సరికొత్త కోణాన్ని చూడబోతున్నాము మా జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి రాబోతున్నారనే విషయం మాతోపాటు మా తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషంగా ఉందని రామచరణ్ తెలియజేసారు.

ఇలా ఇంత మంచి శుభవార్తను రామ్ చరణ్ మొదటగా ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నానని చెప్పడంతో నందమూరి అభిమానులు కూడా వీరి మధ్య ఉన్న అనుబంధం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?