మీకు తెలుసా : కోడి గుడ్లు ఈ విధంగా కూడా ఉపయోగపడతాయంటే మీరు నమ్మరేమో

బక్కగా ఉన్న వారికి, బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు అలాగే పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.

ఉడకబెట్టిన కోడి గుడ్లను తినాలంటూ సూచిస్తూ ఉంటారు.కోడి గుడ్లు తినడం వల్ల లావు అవుతారని అందరికి తెల్సిందే.

ఆ మద్య బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ రోజుకు 10 నుండి 15 గుడ్లు తినేవాడట.

ఆ విషయాన్ని స్వయంగా ప్రభాస్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే.

బరువు పెరగాలంటే ఖచ్చితంగా కోడి గుడ్లు తినాల్సిందే.కాని యూఎస్‌ కు చెందిన ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు బరువు తగ్గాలన్నా కూడా కోడి గుడ్డు మంచి ఔషదం అంటున్నారు.

"""/" /బరువును పెంచే కోడి గుడ్డును ఉపయోగించి బరువును ఎలా తగ్గించుకుంటారు అనే కదా మీ అనుమానం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉబకాయంతో బాధపడేవారు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి.

రెగ్యులర్‌గా తినేదాని కన్నా కనీసం 50 శాతం తక్కువ తినాలి.అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంది.

కాని అలా తక్కువ తినడం వల్ల గ్యాస్‌ ఫామ్‌ అవ్వడం, ఆకలిగా ఉండటం జరుగుతుంది.

తక్కువ తిన్న సమయంలో ఆకలి లేకుండా ఉండాలి అంటే గుడ్డు తినాలి.గుడ్డులో ఉండే పోషకాలు మరియు ఇతర పదార్థాలు ఆకలిని తగ్గిస్తుంది.

అలా తక్కువ ఆహారం తింటారు, బరువు తగ్గుతారు అంటూ వారు నిర్థారించారు. """/" /ఆహారం తక్కువ తీసుకున్న సమయంలో ఒక గుడ్డు తీసుకుంటే పర్వాలేదు.

కాని రోజులో ఎక్కువ కోడి గుడ్లు తీసుకుంటూ ఆహారం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకు బరువు పెరుగుతారు.

బరువు తగ్గాలంటే గుడ్లను మితంగా తీసుకుని ఆహారం తగ్గించుకోవాలి.ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల రెండు లేదా మూడు వారాల్లో మీ బరువులో ఖచ్చితంగా తేడా కనిపిస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

మరెందుకు ఆలస్యం మీరు కాని మీకు చెందిన వారు ఎవరైనా ఉబకాయంతో బాధపడుతుంటే వెంటనే ఈ చిట్కాను వారికి రిఫర్‌ చేయండి లేదంటే మీరు కూడా పాటించండి.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!