ఆ గ్రామానికి గబ్బిలాలే గ్రామ దేవతలట.. వీటిని పూజిస్తే..!

సాధారణంగా మనం గబ్బిలాలను చూస్తేనే బయపడి దూరం జరుగుతాము.ఎందుకంటే వాటి నుండి కొత్త వైరస్ లు వ్యాపిస్తాయని భావించి వాటికీ దూరంగా ఉంటాం.

కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఈ గ్రామంలో గబ్బిలాలను గ్రామ దేవతలుగా పూజిస్తారట.అవి ఉండే చెట్టును పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయని ఆ గ్రామంలోని ప్రజలు ఎప్పటి నుండో నమ్ముతున్నారు.

ఇంత టెక్నాలిజీ పెరిగిన ఇప్పటికి ఆ గ్రామంలోని ప్రజలు మాత్రం ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

చిత్తూరు జిల్లా రామచంద్ర పురం మండలం నడవలూరు గ్రామంలోని ప్రజలు ఒక ఆశ్చర్యాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.

ఆ గ్రామంలో గబ్బిలాలను దేవతలుగా కొలుస్తారట.ఆ గబ్బిలాలు వారిని కష్టాల నుండి బయట పడేస్తాయని నమ్ముతారు.

ఈ గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర 11 చింత చెట్లు ఉంటాయి.ఈ 11 చింత చెట్ల మీద గబ్బిలాలు నివసిస్తున్నాయి.

ఆ గ్రామంలోకి కొత్తగా ఎవరైనా వెళ్తే వాటిని చూసి భయపడడం ఖాయం.కానీ ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం వీటిని గ్రామ దేవతలుగా భావిస్తారు.

"""/"/ వీరు ఇలా భావించడం వెనుక పెద్ద కథ ఉంది.కొంతమంది పిల్లలు బరువు తక్కువుగా, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో పుడుతుంటారు.

ఏదైనా దోషం వల్ల ఇలా జరుగుతుందని కొంత మంది విశ్వాసం.ఈ గ్రామంలోని ప్రజలు అలా అనారోగ్యాలతో జన్మించిన పిల్లలను ఆ చింత చెట్టు ఉన్న దగ్గరకు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారట.

అలా ఆ పూజలు చేస్తే ఆ పిల్లలకు ఉన్న దోషం పోతుందని వీరి నమ్మకం.

ఆ గబ్బిలాలకు ఎవరైనా హాని చెయ్యాలని చుస్తే వారిని చెట్టుకు కట్టేసి మరి బుద్ధి చెప్తారట.

ఈ ఆచారం ఈ ఒక్క గ్రామంలోనే కాదు.కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ప్రజలు పాటిస్తారట.

Viral Video : వీడియో: గర్ల్స్ హాస్టల్‌లోకి దూరిన యువకుడు.. అడ్డంగా బుక్కయ్యాడు..