వాట్సాప్ లో సెల్ఫ్ చాట్ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా..?

అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ ఒకటి.

వాట్సాప్ అడ్వాన్స్ ఫీచర్లు యూజర్లకు అనుకూలంగా ఉండడంతో ఉన్న యూజర్లు చేజారకుండా , కొత్త యూజర్లను ఆకట్టుకుంటుంది.

అందుకు అనుగుణంగా వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తూ అత్యంత ప్రజాదరణ పొందింది.

అందులో భాగంగానే వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

సెల్ఫ్- చాట్ అనే ఫీచర్ అచ్చం నోట్ పాడ్ లా పనిచేస్తుంది.ఇందులో నెల వారి బిల్లింగులు, షాపింగ్ జాబితా, ముఖ్యమైన తేదీలు, చేయాల్సిన పనులు, సమావేశాలు, ఇలా ప్రతిదీ నోట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు, ఫోటోలను కూడా ఇందులో మనం సేవ్ చేసుకోవచ్చు.

ఒకవేళ మొబైల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లు వేతకాలంటే పదే పదే వెతికే పని లేకుండా వెంటనే యాక్సెస్ చేయడానికి కూడా సెల్ఫ్ - చాట్ ఫీచర్ ఉపయోగించవచ్చు.

అసలు వాట్సాప్ సెల్ఫ్ - చాట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.ముందుగా మీ మొబైల్ లో కానీ, లేదా డెస్క్టాప్ లో గాని ఏదో ఒక బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి.

"""/"/ తర్వాత అడ్రస్ బార్లో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం కోడ్ ను టైప్ చేయాలి.

భారతదేశం అయితే 91 సెలెక్ట్ చేసుకుని పది అంకెల మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి తర్వాత Wa.

Me అని టైప్ చేయాలి.తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి.

ఒకవేళ డెస్క్టాప్ వెర్షన్ ను ఉపయోగిస్తుంటే అందులో వాట్సాప్ ను ఓపెన్ చేయమని ఒక ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది.

ఆ తర్వాత కంటిన్యూ టు చాట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

ఇప్పుడు డౌన్లోడ్ వాట్సాప్ లేదా వాట్సాప్ వెబ్ అనే రెండు ఆప్షన్లతో కూడిన ఒక కొత్త విండో కనిపిస్తుంది.

"""/"/ ఇప్పుడు వాట్సాప్ వెబ్ ను ఎంచుకోండి.దీంతో సెల్ఫ్ - చాట్ ఫీచర్ ను ప్రారంభించవచ్చు.

దీని ద్వారా ఎవరికి వారే చాట్ చేసుకోవచ్చు.మొబైల్ యూజర్ల విషయంలో చాట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది.

పైన మొబైల్ నెంబర్, ప్రొఫైల్ పిక్చర్ డిస్ ప్లే అవుతాయి.ఇలా సెల్ఫ్- చాట్ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు.

థియేటర్లలో యావరేజ్ బుల్లితెరపై అదుర్స్.. గుంటూరు కారం మూవీ టీఆర్పీ లెక్క ఇదే!