ఈ దీపావళికి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఒక పండగ వచ్చిందంటే చాలు హీరోలు వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసి ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాలని చూస్తూ ఉంటారు.
ఇక ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా వచ్చిన క(KA) సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతుంది.
ఇక దీంతో పాటుగా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ అలాగే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అమరన్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
"""/" /
ఇక ప్రశాంత్ నీల్ కథ మాటలు అందించిన బఘీర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఇవన్నీ సినిమాలు కూడా ప్రేక్షకుల్లో కొంతవరకు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.ముఖ్యంగా క, లక్కీ భాస్కర్(Lucky Bhaskar), అమరన్ సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించినట్లుగా ప్రేక్షకులు చెబుతున్నారు.
అన్ని సినిమాల్లో క సినిమా మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కొట్టిందని ఈ దీపావళికి లక్ష్మీ బాంబుల పేలిందని సినిమాని చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం.
ఇక మొత్తానికైతే ఈ దీపావళి హీరోగా కిరణ్ అబ్బవరం నిలిచాడనే చెప్పాలి. """/" /
ఇక ఇప్పటికి ఆయన సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి తను మార్గదర్శకంగా నిలుస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగడమే కాకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది ప్రేక్షకులందరికి సంతోషాన్ని కలిగిస్తున్న విషయమనే చెప్పాలి.
ఈ వీడియో చూస్తే.. మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం..