ఇప్పటివరకు “మేడమ్ టుస్సాడ్స్” లో చోటుదక్కించుకున్న ఇండియన్ సెలెబ్రిటీస్ ఎవరో తెలుసా…?
TeluguStop.com
తన చిన్నప్పటి నుండి మైనపు బొమ్మలు తయారు చేసే వ్యక్తి దగ్గర పెరగడంతో టుస్సాడ్స్ అనే అమ్మాయికి వాటిని ఎక్కువ తయారు చేయాలనే ఆసక్తి కలిగింది.
దీనితో ఆమె మెల్లిమెల్లిగా వ్యాక్స్ మోడలింగ్ పై పట్టు సాధించింది.ఇందులో భాగంగా కేవలం ప్రముఖుల మైనపు విగ్రహాలను చేయడంపైనే దృష్టి పెట్టింది.
ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో టుస్సాడ్స్ మ్యూజియాలను ఏర్పాటు చేసింది.అయితే ఇందులో లండన్ లో ఉన్న మ్యూజియం బాగా ప్రాముఖ్యం చెందింది.
ఇక ఈ లండన్ లో టుస్సాడ్స్ మ్యూజియం లో చోటు దక్కించుకున్న మొదటి భారతదేశ సెలబ్రిటి అమితాబ్ బచ్చన్.
2000 సంవత్సరంలో లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.ఇక ఆ తర్వాత సెలబ్రిటి అమితాబ్ బచ్చన్ కోడలి విగ్రహం 2013 లో మరో స్టాట్యూని న్యూయార్క్ మ్యూజియంలో ఏర్పాటు చేసారు.
అయితే 2007 లోనే బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ స్టాట్యూ ఏర్పాటు చేయగా, ఆ తర్వాత 4 విగ్రహాలను వ్యాక్స్ స్టాట్యూస్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని మ్యూజియమ్స్ లో ఏర్పాటు చేసారు.
2008లో టుస్సాడ్స్ మ్యూజియం వారు బాలీవుడ్ మరో స్టార్ సల్మాన్ స్టాట్యూని ఏర్పాటు చేశారు.
ఆపై 2012లో న్యూయార్క్ లోని మ్యూజియంలో మరో స్టాట్యూని ఏర్పాటు చేసారు.ఇక ఆ తరవాత బర్తడేసా ప్రముఖులు అయిన హృతిక్ రోషన్, కరీనా కపూర్, మాధూరి దీక్షిత్, ప్రభాస్, మహేశ్ బాబు, హీరోయిన్ కాజల్ అగర్వాల్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడి విగ్రహాలను ఏర్పాటు చేసారు.
పోలీస్ రోబోను ఆవిష్కరించిన చైనా.. క్రిమినల్స్‌ను పట్టుకుంటుందట..?