ప్రజలను కష్టాల్లో ఆదుకుంటున్న సెలెబ్రిటీలు ఎవరో తెలుసా.. టాప్ లో ఉంది వీరే..!

సెలెబ్రిటీలు ఎన్నో దానధర్మాలు చేసు ఉంటారు.వారిని అభిమానించే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారికీ అండగా మేమున్నామని భరోసా అందిస్తారు.

అలాంటి భరోసా అందించే వారిలో మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు.మరి వీరిలో ఎవరెవరు ప్రజల కష్టాలు తీర్చడంలో ముందు ఉంటారో మీకు తెలుసా.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కాదు దశాబ్దాల కాలం నాటి నుండి ప్రజలకు సేవను అందిస్తున్నారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరుతొ ఈయన తన సేవలను కొనసాగిస్తున్నాడు.ఈ సేవల్లో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్, తమ్ముడు నాగబాబు కూడా ముందు ఉంటారు.

కరోనా సమయంలో ఆక్సిజెన్ బ్యాంక్ స్థాపించి సేవలను చేసారు.వారి సొంత డబ్బు 30 కోట్ల రూపాలను ఖర్చు చేసి మరి ఈ సేవలను కరోనా టైం లో కొనసాగించారు.

ఇక కరోనా వచ్చిన సమయంలో ముందుగా నేనున్నానని చెప్పిన గొప్ప మనుసు ఉన్న వ్యక్తి సోనూసూద్.

ఈయన ఎంతో మంది ప్రజలకు తన సేవలను అందించారు.దీంతో ఈయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

"""/"/ కరోనా సమయంలో సెలెబ్రిటీలు చాలా మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు.

సినీ కార్మికులను హైదరాబాద్ వదిలి పోకుండా వారికీ నిత్యావసర వస్తువులను చిరంజీవి అందించారు.

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయన ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు ఆలోచించకుండా సహాయం చేస్తూ ప్రచారాన్ని సైతం కోరుకోరు.

ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే కూడా ఈయన సహాయం చేయడంలో ముందు ఉంటాడు.

బాలకృష్ణ : ఈయన క్యాన్సర్ హాస్పిటల్ లో క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నారు.

అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించి అందిస్తున్నారు. """/"/ మహేష్ బాబు : ఈయన సేవలు చిన్నారుల ప్రాణాలను నిలబెడుతున్నాయి.

పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు.ఈయన ఇప్పటి వరకు వెయ్యికి పైగానే పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా కోట్లలో దానం చేస్తూ ప్రజల కష్టాలను తీరుస్తున్నారు.

కష్టకాలంలో ఉంటే ముఖ్యమంత్రి నిధికి కోట్ల రూపాయలు అందించారు.ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇలా సీఎం నిధికి డబ్బులు పంపడమే కాకుండా ప్రత్యక్షంగా కూడా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇక కమెడియన్ అలీ కూడా సేవ చేయడంలో ముందు ఉంటారు.ఈయన తన సంపాదనలో కొద్దీ మొత్తం పేద ప్రజలకు విరాళంగా ఇస్తూ వారిని కష్టాల నుండి బయట పడేస్తున్నాడు.

ఇక మంచు హీరోలు, కమెడియన్ సునీల్, జగపతి బాబు, గోపీచంద్ వంటి వారు కూడా సేవలు చేస్తున్నారు.

ఇలా వేరెవ్వరు చేయని సహాయం సినీ సెలెబ్రిటీలు చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరు మారిందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమిదే!