Anushka Shetty : అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక జేజమ్మగా దేవసేనగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సూపర్ ( Super )సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి.

ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సినిమాలకు కమిట్ అయ్యారు.

అయితే అనుష్క ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లోనే ఎవరు చేయని సాహసం చేస్తూ అరుంధతి సినిమాలో నటించారు.

ఇండస్ట్రీలో వచ్చిన మొదట్లోనే ఏ హీరోయిన్ కూడా ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించాలని కోరుకోరు.

కానీ అప్పట్లో అనుష్క నటిస్తున్నారనే విషయం తెలియడంతో అందరూ ఈమె చేస్తున్నటువంటి సాహసంపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు.

"""/" / కానీ అరుంధతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇలా అనుష్క అరుంధతి సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. """/" / ఇకపోతే అనుష్క అరుంధతి సినిమా( Arundhati ) తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఈ సినిమా తర్వాత అనుష్క పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగానే ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనుష్కకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్గా కూడా మంచి గుర్తింపు పొందారని తెలుస్తుంది.

ఈమె ఓ సినిమాకి దర్శకత్వం వహించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. """/" / అనుష్క దర్శకత్వం వహించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే అరుంధతి సినిమా తర్వాత ఈమె భాగమతి ( Bagamathi ) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కూడా అప్పట్లో 40 కోట్లకు పైగా షేర్స్ రాబట్టాయి.అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగం అనుష్కనే దర్శకత్వం వహించారనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనుష్క ఈ సినిమాలో గోడకు చేతిని పెట్టి చేతిపై శిలా వేసే సన్నివేశాలు హైలెట్ అయ్యాయి.

ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనుష్కని ఇచ్చారని తెలుస్తుంది.ఇక డైరెక్టర్ అందుబాటులో లేని సమయంలో ఈమె దర్శకత్వం వహించేవారట.

ముఖ్యంగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నింటికీ కూడా అనుష్కనే డైరెక్ట్ చేశారని తెలుస్తుంది.

ఇక ఈమె డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట.

ఇలా అనుష్కలో ఈ టాలెంట్ కూడా ఉందని తాజాగా ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రుచిగా ఉంటుందని రోజూ కోల్డ్ కాఫీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!