జబర్దస్త్, శ్రీదేవి కార్యక్రమాలకు అన్నపూర్ణమ్మ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అన్నపూర్ణమ్మ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఒకానొక సమయంలో వెండితెరపై వరుస సినిమాలలో నటించిన అన్నపూర్ణమ ప్రస్తుతం వెండితెర పై అడపాదడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ, బుల్లితెరపై మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలు ఎలాంటి ఆదరణ సంపాదించుకున్నాయో మనకు తెలిసిందే.

బుల్లితెరపై అత్యధిక రేటింగ్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న ఈ కార్యక్రమాలలో అన్నపూర్ణమ్మ ఆటో రాంప్రసాద్ స్కిట్ లో చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా ఈమె కమెడియన్లపై తమదైన శైలిలో పంచులు వేస్తూ పెద్ద ఎత్తున జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో ఈమె సందడి చేస్తూ మరింత పాపులర్ అయ్యారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అన్నపూర్ణమ్మ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈమె ఒక్కో కాల్ షీట్ కు ఎంత మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

"""/"/ సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్నపూర్ణమ్మకు మల్లెమాలవారు భారీగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ఈమె సీనియర్ నటిగా గుర్తింపు పొందడమే కాకుండా తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను కూడా నవ్వించడంతో ఈమెకు మల్లెమాలవారు ఒక్క కాల్షీట్ కు సుమారు రెండు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక రోజుకు రెండు లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ప్రస్తుతం ఎంతో పేరు సంపాదించుకున్న కమెడియన్స్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వారితో సమానంగానే ఈమె రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై31, బుధవారం 2024