ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. !

ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు !

ఎన్‌పీఎస్‌లో తాజాగా కొన్ని సవరణలు చేశారు.దీంతో సీనియర్‌ సిటిజెన్స్‌ మరింత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు !

అది ఎలాగో తెలుసుకుందాం.పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ, డెవలప్మెంట్‌ ఆథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఇటీవలె నేషనల్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌పీఎస్‌)లో కొన్ని మార్పులకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు !

ఇది ఆర్థికంగా సీనియర్‌ సిటిజెన్స్‌కు లబ్ధి చేకూరుస్తుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

పీఎఫ్‌ఆర్‌డీఏ విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి.ఎన్‌పీఎస్‌ భారత్‌లో స్వచ్ఛందంగా నిర్వహించే సహకార పెన్షన్‌ వ్యవస్థ.

దీంతో సీనియర్‌ సిటిజెన్స్‌ పెన్షన్ల రూపంలో ప్రణాళికబద్ధమైన పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే, తాజాగా ఎన్‌పీఎస్‌లోకి ప్రవేశించే వయస్సును పెంచారు.అలాగే ఇందులో నుంచి నిష్క్రమణ మార్గదర్శకాల్లో కూడా సవరణలు చేశారు.

పీఎఫ్‌ఆర్‌డీఏ సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం సీనియర్‌ సిటిజెన్లు ఇప్పుడు 70 ఏళ్ల వరకు తమ ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవచ్చు.

H3 Class=subheader-styleఎన్‌పీఎస్‌ తాజా మార్పులు/h3p పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రకారం ఎన్‌పీ పథకంలోకి ప్రవేశించే వయో పరిమితిని పెంచారు.

ఇప్పుడు వయోవృద్ధులు 70 ఏళ్ల వరకు ఈ ఖాతాను ఓపెన్‌చేయవచ్చు.గతంలో 65 ఏజ్‌ లిమిట్‌ ఉండేది.

ఇండియన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌తోపాటు ఓవర్సీస్‌ సిటిజెన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)సిటిజెన్స్‌ కూడా 75 ఏళ్ల వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావచ్చు.

"""/"/ ఎన్‌పీఎస్‌ తాజా సవరణలతో ఒకవేళఇప్పటికే ఎవరైనా ఖాతాను మూసివేసి ఉంటే, మళ్లీ కొత్త ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు.

ఈ కొత్త రూల్స్‌ ప్రకారం ఒకవేళ పెట్టుబడిదారుడి వయస్సు 65 ఏళ్లు పైబడి ఉంటే, వారు ‘ఆటో ఛాయిస్‌’ ఎంపిక చేసుకుంటే, గరిష్టంగా 15 శాతం ఈక్విటీ షేర్లుమాత్రమే కొనుగోలు చేయాలి.

ఎగ్జిట్‌ రూల్స్‌లో కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ మార్పులు చేసింది.ఇప్పుడు పెట్టుబడిదారులు 65 ఏళ్ల తర్వాత మూడేళ్లు గడిచినాక ఎగ్జిట్‌ అయిపోయే వెసులుబాటు కల్పించారు.

దీన్ని ప్రీమెచూర్‌ ఎగ్జిట్‌ అంటారు.ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే మొత్తం పథకం డబ్బులను నామినీకి లామ్సామ్‌గా ఇస్తారు.